
దేశ రక్షణ రంగంలో ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న యువతకు శుభవార్త. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), ఇండియన్ నేవల్ అకాడమీ (INA)లో ప్రవేశాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) NDA 1 2027 షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో శిక్షణ పొందేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు. ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. UPSC విడుదల చేసిన షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం 2026 డిసెంబర్ 2 నుంచి పూర్తి స్థాయి నోటిఫికేషన్‌తో పాటు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 22, 2026లోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
యూపీఎస్సీ NDA ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NDAలోని ఆర్మీ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉండాలి. నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలతో పాటు ఇండియన్ నేవల్ అకాడమీ ప్రవేశాలకు మాత్రం ఇంటర్మీడియట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ (MPC) సబ్జెక్టులు చదివి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు.
అర్హత ఉన్న అభ్యర్థులు UPSC అధికారిక ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దేశ రక్షణ రంగంలో కెరీర్ ప్రారంభించాలని ఆశించే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అందులోని వయోపరిమితి, అర్హతలు, పరీక్షా విధానం, ఇతర నిబంధనలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.
యూపీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.