TSSPDCL: తెలంగాణ విద్యుత్‌ శాఖ.. అసిస్టెంట్ ఇంజనీర్‌, జూనియర్‌ లైన్‌మెన్‌ ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSSPDCL) ఈ నెల 17వ తేదీన అసిస్టెంట్ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్), జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్‌ 'కీ'..

TSSPDCL: తెలంగాణ విద్యుత్‌ శాఖ.. అసిస్టెంట్ ఇంజనీర్‌, జూనియర్‌ లైన్‌మెన్‌ ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల
Tsspdcl Answer Key

Updated on: Jul 26, 2022 | 6:59 PM

TSSPDCL JL, AE Answer Key 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSSPDCL) ఈ నెల 17వ తేదీన అసిస్టెంట్ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్), జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ లు నేడు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ లో ఆన్సర్ కీలను చెక్‌ చేసుకోవచ్చు. ఇక సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు ఈ నెల (జులై) 31న రాత పరీక్ష జరగనుంది. హాల్‌ టికెట్లు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. అసిస్టెంట్ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్) పోస్టులు 70, జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులు 1000, సబ్ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్) పోస్టులు 201 వరకు ఉన్నాయి. వీటన్నింటినీ తాజా రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇతర పూర్త సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ తనిఖీ చేసుకోవచ్చు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us