Telugu News Education Career Jobs TSPSC Group 1 Notification 2024 Released for 563 Posts, here's vacancies list and eligibility criteria
TSPSC Group 1 Notification 2024: పాత నోటిఫికేషన్ రద్దు.. 503 పోస్టులతో టీఎస్‌స్పీయస్సీ గ్రూప్ -1 కొత్త నోటిఫికేషన్ విడుదల! పోస్టుల వివరాలివే..
తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ సోమవారం (ఫిబ్రవరి 19) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. 2022 ఏప్రిల్‌లో గత ప్రభుత్వం 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది గ్రూప్ 1తో సహా వరుస పేపర్ లీకేజీల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపింది. ఈ కారణంగా ఒకసారి..
హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ సోమవారం (ఫిబ్రవరి 19) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. 2022 ఏప్రిల్‌లో గత ప్రభుత్వం 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది గ్రూప్ 1తో సహా వరుస పేపర్ లీకేజీల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపింది. ఈ కారణంగా ఒకసారి గ్రూప్ 1 పరీక్ష రద్దుకాగా.. మరొకమారు నిబంధనలు సరిగా పాటించలేదని ప్రిలిమ్స్ పరీక్షను కోర్టు రద్దు చేసింది. ఇటీవల రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో మరో 60 పోస్టులను గ్రూప్ 1 పోస్టులకు అదనంగా చేర్చింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ పూర్తిగా రద్దు చేసింది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను ప్రకటించింది. మొత్తం పోస్టులతో కలిపి అంటే 563 పోస్టులకు గ్రూప్ 1 పోస్టుల భర్తీకి కమిషన్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఇక ఇప్పటికే గ్రూప్ 1 పోస్టులకు సర్కార్ వయోపరిమితి పెంచింది కూడా. ఆ లెక్కన ఏయే కేటగిరీలకు ఏ విధంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుందో.. విభాగాల వారీగా ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో.. ఆ వివరాలు మీ కోసం..