TS DSC 2024 Vacancies: మార్చి 4 నుంచి డీఎస్సీ దరఖాస్తులు.. జిల్లాలవారీగా పోస్టుల వివరాలు ఇవే! ఆ జాల్లాలో అత్యధిక ఖాళీలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం (ఫిబ్రవరి 29) సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మార్చి 4వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 2వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పోస్టులు ఉన్నాయి..
హైదరాబాద్, మార్చి 1: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం (ఫిబ్రవరి 29) సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మార్చి 4వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 2వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 878 పోస్టులు, రంగారెడ్డి జిల్లాలో 379 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఏయే జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీల వివరాలు ఎలా ఉన్నాయంటే..