Telugu News Education Career Jobs TS DSC Notification 2023: Telangana Government gives green signal to fill 1523 Special Education Teacher Posts though DSC
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సర్కార్ ఆగస్టు 24 విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం పోస్టుల్లో 2,575 ఎస్‌జీటీ పోస్టులు, 1739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 611 భాషా పండితులు పోస్టులు, 164 పీఈటీ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆగస్టు 25న ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ..
హైదరాబాద్, ఆగస్టు 27: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సర్కార్ ఆగస్టు 24 విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం పోస్టుల్లో 2,575 ఎస్‌జీటీ పోస్టులు, 1739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 611 భాషా పండితులు పోస్టులు, 164 పీఈటీ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆగస్టు 25న ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరో 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు ఆ పోస్టులను మంజూరు చేస్తున్నట్లు (శనివారం) ఆగస్టు 26 జీఓ జారీ చేసింది. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను కూడా పాఠశాల విద్యాశాఖ నిర్వహించే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) ద్వారా భర్తీ చేస్తామని ఉత్తర్వుల్లో ప్రకటించింది. మొత్తం పోస్టుల్లో ప్రాథమిక పాఠశాలల్లో 796 పోస్టులు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 727 పోస్టులను మంజూరు చేశారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18,857 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. తాజాగా మంజూరు చేసిన పోస్టుల్లో నల్గొండ జిల్లాకు అత్యధికంగా 91 పోస్టులు, సిరిసిల్ల జిల్లాకు అతి తక్కువగా 20 పోస్టులను మంజూరు చేశారు.
జిల్లాల వారీగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల వివరాలిలా..