AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 ఒక Company, 3 ఒక Crowd అయితే.. 4, 5 ఏమవుతాయి? UPSC ఇంటర్వ్యూ టాపర్‌ ప్రశ్న

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో అభ్యర్థుల ఆలోచనా విధానం, సమయస్ఫూర్తి, తార్కికంగా స్పందించే సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు ఆసక్తిని కలిగిస్తుంటాయి. అలాంటి ప్రశ్నల్లో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రశ్న ఏమిటో.. అభ్యర్ధి సమాధానం ఏం చెప్పారో ఈ కింద తెలుసుకోండి..

2 ఒక Company, 3 ఒక Crowd అయితే.. 4, 5 ఏమవుతాయి? UPSC ఇంటర్వ్యూ టాపర్‌ ప్రశ్న
Tricky UPSC Interview Question
Srilakshmi C
|

Updated on: Oct 20, 2026 | 2:31 PM

Share

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోటీ పరీక్షల్లో ఒకటి. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలంటే అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్‌తో పాటు పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ)లోనూ తమ ప్రతిభను నిరూపించుకోవాలి. ముఖ్యంగా ఇంటర్వ్యూలో అభ్యర్థుల విజ్ఞానంతో పాటు ఆలోచనా విధానం, తార్కికంగా స్పందించే సామర్థ్యం, సమయస్ఫూర్తి, ప్రశ్నను అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు సంబంధించిన చిత్రం వైరల్ అవుతోంది. ఈ ప్రశ్నను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో రెండో ర్యాంకు సాధించిన అభ్యర్థిని యూపీఎస్సీ ఇంటర్వ్యూ ప్యానెల్‌లో అడిగిన ప్రశ్న. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే?

ప్రశ్న: 2 ఒక కంపెనీ (Company), 3 ఒక గుంపు (Crowd) అయితే.. 4, 5 ఏమవుతాయి?

ఈ ప్రశ్నను చూసిన వెంటనే చాలామంది సంఖ్యల మధ్య ఏదైనా ప్రత్యేకమైన సంబంధం ఉందా అని ఆలోచిస్తారు. రెండు, మూడు సంఖ్యలను కంపెనీ, గుంపు వంటి పదాలతో అనుసంధానించడంతో ప్రశ్నకు ఏదో ప్రత్యేకమైన అర్థం ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే సమాధానాన్ని అంతకంటే విచిత్రంగా ఉంటుంది.

సమాధానం ఏమిటి?

4, 5 కలిపితే 9 అవుతుంది.

ఇవి కూడా చదవండి

అంటే 4 + 5 = 9. ప్రశ్నలోని మొదటి భాగం మనల్ని సంఖ్యలకు సంబంధించిన మరో సంబంధం గురించి ఆలోచించేలా చేసినప్పటికీ, సమాధానం మాత్రం సాధారణ కూడిక రూపంలో ఉంది. ఇలాంటి ప్రశ్నల్లో కొన్నిసార్లు ప్రశ్నను క్లిష్టంగా భావించకుండా, అందులో అడిగిన విషయాన్ని నేరుగా అర్థం చేసుకోవడం ముఖ్యం.

UPSC ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారు..?

సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్‌లో అభ్యర్థి కేవలం పుస్తకాల్లోని సమాచారాన్ని ఎంతవరకు గుర్తుంచుకున్నారనే విషయమే కాకుండా, ప్రశ్నలకు ఎలా స్పందిస్తారు, ఒత్తిడిలో ఎలా ఆలోచిస్తారు, తమ అభిప్రాయాన్ని ఎంత స్పష్టంగా వ్యక్తపరుస్తారు వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఇలాంటి చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పడమే ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి సరిపోదు. అభ్యర్థి మొత్తం వ్యక్తిత్వం, సమాధానాల నాణ్యత, విశ్లేషణాత్మక దృష్టి, నిజాయితీ, నిర్ణయాలు తీసుకునే విధానం వంటి అనేక అంశాలు పరిశీలనలోకి వస్తాయి. UPSC ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలంటూ సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ప్రశ్నను అధికారికంగా ధృవీకరించినదిగా భావించకూడదు. వాటిని సాధన కోసం ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ప్రశ్నను జాగ్రత్తగా చదవడం, అందులోని పదాలను అర్థం చేసుకోవడం, అవసరమైనప్పుడు సరళమైన సమాధానం ఇవ్వడం వంటి అలవాట్లు ఇంటర్వ్యూ సన్నద్ధతకు ఉపయోగపడతాయి.

Follow Us