TGPSC AEE Jobs 2026: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్

Telangana AEE Notification 2026: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 222 ఏఈఈ (సివిల్) ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది..

TGPSC AEE Jobs 2026: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్
Telangana AEE Notification

Updated on: Jun 03, 2026 | 4:42 PM

తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 222 ఏఈఈ (సివిల్) ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టుల్లో 112 పోస్టులు మల్టీజోన్‌ 1లో, 110 పోస్టులు మల్టీజోన్‌ 2లో ఉన్నాయి. బీఈ, బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జూన్‌ 6 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

టీజీపీఎస్సీ ఏఈఈ (సివిల్) ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఏఎంఐఈ)లో అర్హత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2026 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జులై 13, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.500 చొప్పున చెల్లించాలి. దీనితో పాటు అదనంగా పరీక్ష ఫీజు కింద మరో రూ.120 ప్రతి ఒక్కరూ చెల్లించాలి. నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 6, 2026.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 13, 2026 సాయంత్రం 5 గంటల వరకు
  • రాత పరీక్ష తేదీ: అక్టోబర్ 2026లో

టీజీపీఎస్సీ ఏఈఈ (సివిల్) ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us