
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TGPRB) కీలక అప్‌డేట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో మొత్తం 7,437 పోలీసు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 9, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ పోలీసు నియామక మండలి గత నెలలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి నాలుగు నోటిఫికేషన్లను విడుదల చేసింది. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (AR), స్పెషల్ పోలీస్, జైళ్లు, ఫైర్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 19 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబర్ 9, 2026లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయోపరిమితి, శారీరక ప్రమాణాలు, ఇతర అర్హతలను సంబంధిత నోటిఫికేషన్‌లో పరిశీలించుకోవల్సి ఉంటుంది. పోలీసు ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో రాత పరీక్షతో పాటు పోస్టును బట్టి శారీరక సామర్థ్య పరీక్ష (PET), శారీరక కొలతల పరీక్ష (PMT), తదితర దశలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు సంబంధిత పోస్టుకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను చదివి, ఎంపిక విధానం, సిలబస్, పరీక్ష విధానం తదితర వివరాలను తెలుసుకోవాలి. అలాగే పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, ఫీజు, పరీక్ష విధానం, శారీరక ప్రమాణాలు, దరఖాస్తు విధానం వంటి వివరాలు వేర్వేరుగా ఉండొచ్చు. అభ్యర్థులు TGPRB అధికారిక నోటిఫికేషన్లను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.