TG ECET 2026 Schedule: తెలంగాణ ఈసెట్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల.. మరో 2 రోజుల్లోనే దరఖాస్తులు ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈసెట్‌ 2026 పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటన వెలువరించింది. తెలంగాణ ఈసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 9, 2026వ తేదీ నుంచి ప్రారంభం కానుంది..

TG ECET 2026 Schedule: తెలంగాణ ఈసెట్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల.. మరో 2 రోజుల్లోనే దరఖాస్తులు ప్రారంభం
Telangana ECET 2026 Schedule

Updated on: Feb 06, 2026 | 4:23 PM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈసెట్‌ 2026 పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటన వెలువరించింది. తెలంగాణ ఈసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 9, 2026వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్‌ 18వ తేదీగా నిర్ణయించారు.

ఈసెట్‌ పరీక్ష మే 15న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. కాగా ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశాలు కల్పించేందుకు యేటా ఈసెట్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాలిటెక్నిక్‌ కోర్సులు చదివే విద్యార్ధులు ఈసెట్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఇంజనీరింగ్‌ రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ డీఈఈసెట్‌ 2026 పరీక్ష తేదీలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఈడీ) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ క్రమంలో తాజాగా పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం మే 21, 22 తేదీల్లో డీఈఈసెట్‌ను నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఆన్‌లైన్‌ విధానం (సీబీటీ)లో ఈ పరీక్షలు జరుపుతారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్, దరఖాస్తు తేదీలు, ఫీజు వివరాలు వంటి ఇతర పూర్తి సమాచారం ఫిబ్రవరి చివరి వారంలో వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని 11 ప్రభుత్వ, 66 ప్రైవేట్‌ డీఈడీ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us