SSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ 2026 వచ్చేసిందోచ్.. నవంబర్ 2 నుంచే పరీక్షలు!
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2026 నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించనున్న జూనియర్ ఇంజినీర్ (JE), దిల్లీ పోలీసు-CAPF సబ్-ఇన్‌స్పెక్టర్ (SI), CHSL పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. JE పేపర్-1 నవంబర్ 2 నుంచి, SI పరీక్షలు నవంబర్ 20 నుంచి, CHSL టైర్-1 పరీక్షలు నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి..

హైదరాబాద్, అక్టోబర్ 2: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2026 నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించనున్న పలు కీలక ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూనియర్ ఇంజినీర్ (JE), దిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) సబ్-ఇన్‌స్పెక్టర్ (SI), కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) పరీక్షలు ఈ షెడ్యూల్‌లో ఉన్నాయి.
నవంబర్‌లో జూనియర్ ఇంజినీర్ పరీక్ష: SSC జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్-2026 పేపర్-1 పరీక్షలను నవంబర్ 2 నుంచి 6 వరకు నిర్వహించనుంది. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) విధానంలో జరుగుతుంది. ఇంజినీరింగ్ విభాగాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు.
నవంబర్ 20 నుంచి SI పరీక్షలు: ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) నియామక పరీక్షలను నవంబర్ 20 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు SSC తెలిపింది. ఈ పరీక్ష కూడా కంప్యూటర్ ఆధారిత విధానంలోనే జరుగుతుంది.
SSC ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నవంబర్ 30 నుంచి CHSL పరీక్ష: ఇక 10+2 అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (CHSL) టైర్-1 పరీక్షలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు జరగనున్నాయి. పోస్టులు, పరీక్షా కేంద్రాలు, షిఫ్టులు తదితర వివరాలను SSC తదుపరి దశలో వెల్లడించనుంది.
అభ్యర్థులు ఏం చేయాలి?
ఇది తాత్కాలిక షెడ్యూల్ మాత్రమే కావడంతో పరీక్ష తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన తాజా ప్రకటనలు, అడ్మిట్ కార్డులు/హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రాల వివరాలు, తేదీల మార్పు వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అధికారిక సమాచారం కోసం అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inను క్రమం తప్పకుండా సందర్శించాలని కమిషన్ సూచించింది.
పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..
- SSC JE 2026 Paper-1 పరీక్ష తేదీ: నవంబర్ 2–6, 2026.
- Delhi Police/CAPF SI 2026 పరీక్ష తేదీ: నవంబర్ 20–28, 2026.
- SSC CHSL 2026 Tier-1 పరీక్ష తేదీ: నవంబర్ 30–డిసెంబర్ 31, 2026.




