AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC UG 2026 ఫలితాలు వచ్చేశాయ్‌.. మరికొన్ని గంటల్లో స్కోర్‌ కార్డులు డౌన్‌లోడ్ లింక్‌ యాక్టివ్

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ యూజీ 2026 సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్ల జాబితాను ప్రాంతీయ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు. ఆగస్టు 26 సాయంత్రం 5 గంటలకు స్కోర్‌కార్డులు విడుదల కానున్నాయి. అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా స్కోర్ కార్డు..

RRB NTPC UG 2026 ఫలితాలు వచ్చేశాయ్‌.. మరికొన్ని గంటల్లో స్కోర్‌ కార్డులు డౌన్‌లోడ్ లింక్‌ యాక్టివ్
RRB NTPC UG Result Out
Srilakshmi C
|

Updated on: Aug 25, 2026 | 2:39 PM

Share

హైదరాబాద్‌, ఆగస్ట్ 25: రైల్వేశాఖలోని నాన్‌-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) అండర్‌గ్రాడ్యుయేట్ (UG) CEN 07/2025 పోస్టులకు సంబంధించిన ఫలితాలను తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ప్రాంతీయ ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ప్రాంతీయ వెబ్‌సైట్‌లో స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. RRB NTPC UG సీబీటీ 1లో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్ల జాబితాను RRB బోర్డు ప్రస్తుతానికి విడుదల చేసింది. సీబీటీ 1లో అర్హత సాధించిన వారిని తదుపరి దశ అయిన సీబీటీ 2 పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈ జాబితాలో తమ రోల్ నంబర్ ఉందో లేదో సంబంధిత వెబ్‌సైట్‌ జాబితాలో పరిశీలించుకోవచ్చు. ఇక అభ్యర్థుల స్కోర్‌కార్డులను ఆగస్టు 26 సాయంత్రం 5 గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది.

RRB NTPC UG 2026 స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సెప్టెంబర్ మూడో వారంలో సీబీటీ 2

సీబీటీ 2కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఆర్‌ఆర్‌బీ ప్రొవిజనల్‌గా విడుదల చేసింది. వివరాల్లో ఏదైనా వ్యత్యాసం గుర్తిస్తే బోర్డు ఆ జాబితాలోని అర్హతను రద్దు చేసే అవకాశం ఉంది. స్కోర్‌కార్డులు విడుదలైన తర్వాత మాత్రమే అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్, మార్కులు తదితర వివరాలను పూర్తిగా పరిశీలించుకోవాలి. ఏదైనా తప్పు ఉంటే సంబంధిత ఆర్‌ఆర్‌బీ అధికారులను సంప్రదించి సరిచేయించుకోవాలని అధికారులు సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు నిర్వహించనున్న సీబీటీ 2 పరీక్షను 2026 సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహించేందుకు ఆర్‌ఆర్‌బీ ప్రాథమికంగా షెడ్యూల్ చేసింది. పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను, పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు కాల్ లెటర్లను విడుదల చేయనుంది.

ఇవి కూడా చదవండి

కాగా ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ యూజీ 2026 సీబీటీ 1 పరీక్షను మే 7, 9 తేదీల్లో కొంతమంది అభ్యర్థులకు, మిలిగిన వారికి మే 13 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్‌టీపీసీ యూజీ నియామక ప్రక్రియలో మొత్తం నాలుగు దశలు ఉంటాయి. మొదట సీబీటీ 1, తర్వాత సీబీటీ 2 నిర్వహిస్తారు. పోస్టును బట్టి కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) లేదా టైపింగ్ స్కిల్ టెస్ట్, అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ మొత్తం 3,058 అండర్‌గ్రాడ్యుయేట్ ఎన్‌టీపీసీ పోస్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. సీబీటీ 1లో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ సీబీటీ 2కు సిద్ధం కావాలని ఆర్‌ఆర్‌బీ సూచించింది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోండి.

RRB NTPC UG 2026 స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
మరణంలోనూ వీడని బంధం.. అన్న శవాన్ని చూసి ఆగిన చెల్లెలి గుండె!
మరణంలోనూ వీడని బంధం.. అన్న శవాన్ని చూసి ఆగిన చెల్లెలి గుండె!
వినాయక చవితి.. గణపతి ప్రతిష్ఠాపనకు శుభ ముహుర్తాలు ఇవే!
వినాయక చవితి.. గణపతి ప్రతిష్ఠాపనకు శుభ ముహుర్తాలు ఇవే!
ఇలా మూడు రోజులు చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గి మోకాళ్ళలో గుజ్జు
ఇలా మూడు రోజులు చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గి మోకాళ్ళలో గుజ్జు
కాలిఫోర్నియాలో భారత సంతతి మహిళ దారుణ హత్య..
కాలిఫోర్నియాలో భారత సంతతి మహిళ దారుణ హత్య..
ఆ స్టార్ హీరో నాకు చాలా సాయం చేశాడు..
ఆ స్టార్ హీరో నాకు చాలా సాయం చేశాడు..
‘మిషన్ మార్చి’.. ఈ ఏడాది పదో తరగతిలో 90 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
‘మిషన్ మార్చి’.. ఈ ఏడాది పదో తరగతిలో 90 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
అర్థరాత్రి హాస్టల్‌ నుంచి గట్టి గట్టిగా కేకలు.. ఏమైందని వెళ్లగా..
అర్థరాత్రి హాస్టల్‌ నుంచి గట్టి గట్టిగా కేకలు.. ఏమైందని వెళ్లగా..
బిన్ లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. రహస్య పత్రాలను బయటపెట్టిన..
బిన్ లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. రహస్య పత్రాలను బయటపెట్టిన..
మరో రెండు రోజుల్లోనే APPSC గ్రూప్‌ 1 నోటిఫికేషన్ 2026 విడుదల..
మరో రెండు రోజుల్లోనే APPSC గ్రూప్‌ 1 నోటిఫికేషన్ 2026 విడుదల..