AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MBBS, BDS మెడికల్‌ కోర్సుల ఫీజులు పెరిగాయ్‌.. పూర్తి వివరాలు ఇవిగో

మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజుల భారం మరింత పెరిగింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి UG కోర్సులతో పాటు PG మెడికల్, డెంటల్ కోర్సులకు కూడా ప్రభుత్వం మధ్యంతర ఫీజులను ఖరారు చేసింది. UG కోర్సులకు 10 శాతం, PG కోర్సులకు 15 శాతం పెంపుతో కొత్త ఫీజులను..

MBBS, BDS మెడికల్‌ కోర్సుల ఫీజులు పెరిగాయ్‌.. పూర్తి వివరాలు ఇవిగో
Private Medical, Dental College Fees Hiked
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Aug 29, 2026 | 3:39 PM

Share

అమరావతి, ఆగస్ట్‌ 29: ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజుల భారం మరింత పెరిగింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి UG కోర్సులతో పాటు PG మెడికల్, డెంటల్ కోర్సులకు కూడా ప్రభుత్వం మధ్యంతర ఫీజులను ఖరారు చేసింది. UG కోర్సులకు 10 శాతం, PG కోర్సులకు 15 శాతం పెంపుతో కొత్త ఫీజులను నిర్ణయించింది. MBBS, BDS UG కోర్సులకు 2025-26లో ఉన్న ఫీజులపై 10 శాతం పెంపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. MBBS ఏ-కేటగిరీ ఫీజు రూ.18,150 కాగా.. బీ-కేటగిరీ ఫీజు రూ.14.52 లక్షలుగా నిర్ణయించారు. NRI కోటాలో సీ-కేటగిరీ ఫీజు రూ.43.56 లక్షల వరకు ఉంటుంది.

BDS ఫీజులు ఖరారు

BDSలో ఏ-కేటగిరీ ఫీజు రూ.15,730.. బీ-కేటగిరీ ఫీజు రూ.4.84 లక్షలుగా ఖరారైంది. NRI కోటాలో సీ-కేటగిరీ ఫీజు రూ.14.52 లక్షల వరకు నిర్ణయించారు. PG మెడికల్ కోర్సులకు 15 శాతం పెంపుతో మధ్యంతర ఫీజులు ఖరారయ్యాయి. క్లినికల్ డిగ్రీల్లో ఏ-కేటగిరీ ఫీజు రూ.5,71,320.. బీ-కేటగిరీ ఫీజు రూ.11,42,640గా నిర్ణయించారు. NRI కోటాలో సీ-కేటగిరీ ఫీజు రూ.66,12,500గా ఖరారైంది. పారా క్లినికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సులకు ఏ-కేటగిరీ ఫీజు రూ.1,78,538గా.. ప్రీ క్లినికల్ డిగ్రీకి రూ.80,937గా నిర్ణయించారు. PG డెంటల్ క్లినికల్ డిగ్రీల్లో ఏ-కేటగిరీ ఫీజు రూ.3,92,783.. బీ-కేటగిరీ ఫీజు రూ.7,85,565గా ఖరారైంది. NRI కోటాలో సీ-కేటగిరీ ఫీజు రూ.15,87,000గా నిర్ణయించారు. డెంటల్ పారా క్లినికల్ డిగ్రీల్లో ఏ-కేటగిరీ ఫీజు రూ.3,53,504.. బీ-కేటగిరీ ఫీజు రూ.5,74,759గా నిర్ణయించారు. సీ-కేటగిరీ ఫీజు రూ.9,25,750గా ఖరారైంది. ప్రభుత్వం నిర్ణయించిన మధ్యంతర ఫీజులకు మించి ప్రైవేట్ కాలేజీలు ఎలాంటి అదనపు మొత్తాన్ని వసూలు చేయరాదు. ఏ రూపంలోనైనా అదనపు వసూళ్లు చేస్తే నిబంధనలకు విరుద్ధంగా పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి

తుది ఫీజుల తర్వాత సర్దుబాటు

ప్రస్తుతం ప్రకటించిన ఫీజులు 2026-27 విద్యా సంవత్సరానికి మాత్రమే మధ్యంతరంగా అమల్లో ఉంటాయి. APHEFR&MC తుది ఫీజులను నిర్ణయించిన తర్వాత ఫీజులో తేడా వస్తే.. విద్యార్థులకు రీఫండ్ లేదా సర్దుబాటు చేయాలి. తుది ఫీజు పెరిగితే నిబంధనల ప్రకారం అదనపు మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉంటుంది. అంటే.. ఒకవైపు UGలో MBBS, BDS ఫీజుల పెంపు.. మరోవైపు PG మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజుల పెంపుతో ప్రైవేట్ వైద్య విద్య మరింత ఖరీదుగా మారనుంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఇంటెరిమ్ ఫీజులే.. కమిటీ తుది నిర్ణయం తర్వాత ఫీజుల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

Follow Us
ఎంత కడిగినా లంచ్ బ్యాగ్ వాసన పోవడం లేదా? మురికి దాక్కునేది ఇక్కడే
ఎంత కడిగినా లంచ్ బ్యాగ్ వాసన పోవడం లేదా? మురికి దాక్కునేది ఇక్కడే
56 ఏళ్ల వయసులో రాత్రికి రాత్రే స్మోకింగ్ మానేసిన నానా పటేకర్
56 ఏళ్ల వయసులో రాత్రికి రాత్రే స్మోకింగ్ మానేసిన నానా పటేకర్
దుర్గా దేవి అనుగ్రహం..దసరాల నుంచి వీరి దశ తిరిగినట్టే..!
దుర్గా దేవి అనుగ్రహం..దసరాల నుంచి వీరి దశ తిరిగినట్టే..!
బతుకమ్మ పూలలో దాగున్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!
బతుకమ్మ పూలలో దాగున్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!
దసరాకు ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ మరో శుభవార్త..
దసరాకు ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ మరో శుభవార్త..
కాశినాయన జ్యోతిక్షేత్రం సమీపంలో వింత శబ్ధాలు.. వెళ్లి చూస్తే..!
కాశినాయన జ్యోతిక్షేత్రం సమీపంలో వింత శబ్ధాలు.. వెళ్లి చూస్తే..!
భారత్‌పై నెగెటివ్ ప్రచారమా? బ్రిటిష్ టూరిస్ట్ ఫైర్
భారత్‌పై నెగెటివ్ ప్రచారమా? బ్రిటిష్ టూరిస్ట్ ఫైర్
చంద్రుడి అనుగ్రహం.. వీరికి ధన యోగాలు, రాజయోగాలు పక్కా..!
చంద్రుడి అనుగ్రహం.. వీరికి ధన యోగాలు, రాజయోగాలు పక్కా..!
బిగ్ షాకింగ్ భయ్యో.. రాంచీలో గెలుపు ఎవరిదో తేలిపోయిందిగా..!
బిగ్ షాకింగ్ భయ్యో.. రాంచీలో గెలుపు ఎవరిదో తేలిపోయిందిగా..!
బ్రోకలీతో ఇంత టేస్టీగా పులావ్ చేయొచ్చా? సింపుల్ రెసిపీ!
బ్రోకలీతో ఇంత టేస్టీగా పులావ్ చేయొచ్చా? సింపుల్ రెసిపీ!