నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవన్ కార్పొరేషన్ (NHPC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ పలు ట్రేడుల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏడాది శిక్షణకు గాను ఈ పోస్టులను ఎంపిక చేయనున్నారు. ఏయే ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.? అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 45 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* మెకానిక్ (ఎంవీ), పీవోపీఏ, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రినిక్, వెల్డర్, వైర్ మ్యాన్, కార్పెంటర్, మేసన్ వంటి ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు ఏప్రిల్ 10, 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను పవర్ స్టేషన్ తనక్‌పూర్ (ఉత్తరాఖండ్) అడ్రస్‌కు పంపిచాలి.
* అభ్యర్థులను ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* తొలుత అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకున్న అనంతరం దరఖాస్తులను పంపిచాల్సి ఉంటుంది.
* అప్రెంటిస్ పోర్టల్‌లో వివరాల నమోదుకు 03-05-2023 చివరి తేదీకాగా, ఆఫ్‌లైన్ దరఖాస్తులకు మే 15, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..