NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మందికి చుక్కెదురు.. MBBS, BDS సీట్లు రద్దు!

నీట్‌ యూజీ-2026లో ఎస్టీ రిజర్వేషన్‌ కింద అర్హత పొందిన 37 మంది అభ్యర్థులు ఆ కేటగిరీకి చెందరని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వెల్లడించింది. వీరిలో ఇప్పటికే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లు పొందిన 9 మంది సీట్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రద్దైన సీట్లను మూడో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నట్లు వర్సిటీ పేర్కొంది..

NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మందికి చుక్కెదురు.. MBBS, BDS సీట్లు రద్దు!
NEET UG Counselling

Updated on: Sep 27, 2026 | 4:39 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 27: నీట్‌ యూజీ-2026లో ఎస్టీ (Scheduled Tribe) రిజర్వేషన్‌ కింద అర్హత పొందిన 37 మంది అభ్యర్థులు వాస్తవానికి ఆ కేటగిరీకి చెందరని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఈ మేరకు సెప్టెంబరు 26న వర్సిటీ ప్రకటన విడుదల చేసింది. గిరిజన సంక్షేమశాఖ నిర్వహించిన పరిశీలనలో ఈ 37 మంది అభ్యర్థులను ఎస్టీయేతరులుగా గుర్తించినట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. దీంతో ఎస్టీ రిజర్వేషన్‌ కింద ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లు పొందేందుకు వారు అర్హులు కాదని స్పష్టం చేసింది.

ఈ మేరకు 37 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను వర్సిటీ విడుదల చేసింది. వారిలో ఇప్పటికే 9 మంది అభ్యర్థులు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో సీట్లు పొందినట్లు గుర్తించింది. ఎస్టీ రిజర్వేషన్‌ కింద పొందిన ఈ సీట్లను రద్దు చేస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. మిగిలిన అభ్యర్థులకు సంబంధించిన సీట్ల భర్తీపై కూడా వర్సిటీ స్పష్టత ఇచ్చింది. రద్దైన సీట్లను NEET UG 2026 మూడో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రాలు, సంబంధిత రికార్డుల పరిశీలన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ వెల్లడించింది. తాజా పరిణామంతో ఎస్టీ రిజర్వేషన్‌ కింద సీట్లు పొందిన అభ్యర్థుల్లో మరోసారి ధ్రువపత్రాల పరిశీలనపై దృష్టి సారించే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us