US Layoffs: అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న ఆర్థిక మాంద్యం.. భారతీయ టెక్కీలే బలి.. వీసా స్టేటస్‌ మార్పుకోసం యత్నాలు

|

Feb 04, 2023 | 6:27 AM

అగ్రరాజ్యంలో దినదినగండంగా గడుపుతున్న భారత్ టెక్కీలు. ఉద్యోగాలు కోల్పోయి అష్టకష్టాలు పడుతున్నారు తెలుగు సీనియర్ ఐటీ ఉద్యోగులు.

US Layoffs: అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న ఆర్థిక మాంద్యం.. భారతీయ టెక్కీలే బలి.. వీసా స్టేటస్‌ మార్పుకోసం యత్నాలు
Us Layoff
Follow us on

మనిషి జీవితం కరోనాకు ముందు తర్వాత అని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఆర్ధిక మాంద్యంతో ఇబ్బందులు పడుతున్నాయి. అనేక సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్నారు.  దీంతో వేలాది మంది ఉద్యోగుల భద్రత లేకుండా పోయింది. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియక.. భయంభయంగా గడుతున్నారు. కేవలం యువ టెక్కీలే కాదు, 15 సంవత్సరాల సీనియార్టీ ఉన్న IT నిపుణులు సైతం లేఆఫ్‌నకు గురవుతున్నారు. ఆర్థిక మాద్యం ఎఫెక్ట్ తో ఉద్యోగాలు పోయి రోడ్డునపడుతున్నారు. ఆర్థిక మాంద్యం అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తుంది. అమెరికన్‌ దిగ్గజ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతేడాది నవంబరు నుంచే మొదలైన తొలగింపుల ప్రక్రియ మరింత ఉధృతమవుతోంది. ఇప్పటివరకు వెయ్యికి పైగా టెక్‌ కంపెనీలు ఏకంగా 2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రధానంగా భారతీయ ఐటీ నిపుణులే ఎక్కువగా బలవతున్నారు. 30 నుంచి 40 శాతం మంది భారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు జాబ్స్ కోల్పోయారు. వారంత హెచ్‌-1బీ, ఎల్‌- వీసాలతో అమెరికాలో ఉంటున్నారు. ఈ వీసాల నిబంధనల ప్రకారం.. 60 రోజుల్లో ఉద్యోగం వెతుక్కోవాలి.. లేదంటే అమెరికాను వీడాల్సి ఉంటుంది. గడువులోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవడం లేదా.. వీసా స్టేటస్‌ను మార్చుకునేందుకు భారతీయ టెక్కీలు అష్టకష్టాలు పడుతున్నారు.

కొంతమంది జాబ్ నుంచి తొలగించిన 30 రోజుల్లో రోజూ 80-100 ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూలు రాకపోగా.. చాలా సంస్థలు H-1B వీసా హోల్డర్ల కంటే ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. వీసా స్టేటస్‌ని F1 లేదా H4కి మార్చడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతానికి చాలా మంది తెగతెంపుల ప్యాకేజీలతోనే బతుకుతున్నారని, ఉద్యోగుల తొలగింపు అసలు ప్రభావం మరో రెండు నెలల్లో తేలనుందని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీ వ్యవస్థాపకుడు విశ్వేశ్వర్ రెడ్డి కలవాల చెప్పారు. గ్రేస్ పీరియడ్‌ను ఆరు నెలలకు పొడిగిస్తే హెచ్‌-1బీ హోల్డర్‌లకు ఇది సహాయపడుతుందని విశ్వేశ్వరరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ – మెటా, ట్విట్టర్‌ వంటి పెద్ద టెక్‌ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గూగుల్‌ తాజాగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..