AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయనున్న సర్కార్

TG Anganwadi Jobs 2026: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో కీలక అడుగు పడింది. అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు సొంతభవనాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యా, వైద్య, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయనున్న సర్కార్
Telangana Anganwadi Jobs
Srilakshmi C
|

Updated on: May 05, 2026 | 6:43 PM

Share

సంగారెడ్డి, మే 5: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అన్ని వర్గాల ప్రజల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం (మే 5) జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జోగిపేట- ఆందోల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, ఆయాలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కనబడితే ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యం, మహిళా సాధికారత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో మంత్రి 10 మంది దివ్యాంగులకు ఉచిత స్కూటీలు, 286 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయనున్న సర్కార్
అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయనున్న సర్కార్
ముంబై సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పోస్ట్ ఊస్ట్..?
ముంబై సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పోస్ట్ ఊస్ట్..?
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన టీవీకే చీఫ్ విజయ్..!
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన టీవీకే చీఫ్ విజయ్..!
దీన్ని చూస్తే చావుకే వణుకు పుడుతుంది.. అత్యంత ప్రమాదకర పాము..
దీన్ని చూస్తే చావుకే వణుకు పుడుతుంది.. అత్యంత ప్రమాదకర పాము..
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులతో కూర వండిన మహిళ.. ఆ తర్వాత
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులతో కూర వండిన మహిళ.. ఆ తర్వాత
శని, రాహు, కేతువుల ఎఫెక్ట్.. ఈ పరిహారాలతో వారికి విజయం పక్కా..!
శని, రాహు, కేతువుల ఎఫెక్ట్.. ఈ పరిహారాలతో వారికి విజయం పక్కా..!
ప్రధాని మోదీ ఇష్టంగా తినే మునగాకు పరాటా.. రోజూ ఒక్కటి తింటే ..
ప్రధాని మోదీ ఇష్టంగా తినే మునగాకు పరాటా.. రోజూ ఒక్కటి తింటే ..
సార్.. మీరేంటిలా ? ఈ టాలీవుడ్ యాక్షన్ హీరోను గుర్తు పట్టారా?
సార్.. మీరేంటిలా ? ఈ టాలీవుడ్ యాక్షన్ హీరోను గుర్తు పట్టారా?
బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?
బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?
'ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగారు'..: మాజీ క్రికెటర్
'ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగారు'..: మాజీ క్రికెటర్