ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.
* ఆక్యురియల్, ఫైనాన్స్, లా, ఐటీ, రిసెర్చ్, జనరలిస్ట్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 44,500 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు మే 10వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..