
హైదరాబాద్, ఏప్రిల్ 17: దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మే నెలలో చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌లను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విడుదల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా ఐసీఏఐ విడుదల చేసింది. పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ICAI అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే తొలుత ప్రకటించిన పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు ICAI తన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు విద్యార్ధులు
సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల 2026 హాల్ టికెట్ల డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గతంలో మే 3, 5, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలు.. ఇప్పుడు మే 5, 7, 9 తేదీల్లో నిర్వహించనున్నారు.
మే 9, 11, 13 తేదీలకు బదులుగా.. మే 11, 13, 15 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.
ఆయా తేదీల్లో ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే ఇంటర్మీడియట్, ఫైనల్ విద్యార్ధులందరూ అధికారిక ఈ-సర్వీసెస్ పోర్టల్‌లో తమ లాగిన్ వివరాలను నమోదు చేసి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఐసీఏఐ సూచించింది. ఈ మేరకు మే 2026 పరీక్షల షెడ్యూల్‌లో మారిన పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని విద్యార్ధులు తదనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలని బోర్డు సూచించింది.
కాగా ఈ ఏడాది నుంచి సీఏ ఫైనల్ పరీక్షలు మూడు సార్లకు బదులు కేవలం రెండు సార్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విధానం మే 2026 నుంచి ప్రారంభమవుతుంది. దీంతో ఇకప కేవలం మే, నవంబర్ నెలల్లో మాత్రమే సీఏ ఫైనల్ పరీక్షలు రెండు సార్లు జరగనున్నాయి.
సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల 2026 హాల్ టికెట్ల డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.