
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) భారీ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRBs) వివిధ ఉద్యోగాల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ RRBs XV (CRP RRBs XV) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 13,706 గ్రూప్ ఏ ఆఫీసర్, గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్ధులు ఇవాళ్టి (సెప్టెంబర్ 1, 2026) నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..
IBPS RRB ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IBPS RRB ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, చార్టర్డ్ అకౌంటెంట్ (CA), MBA వంటి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాలు, ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 సంవత్సరాలు, ఆఫీసర్ స్కేల్ III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుంచి 40 సంవత్సరాలు, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల వరకు వయసు ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 21, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. పోస్టును బట్టి అభ్యర్థుల ఎంపికలో ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష/సింగిల్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితర దశలు ఉంటాయి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆఫీసర్ పోస్టులకు పోస్టును బట్టి ప్రిలిమ్స్, మెయిన్స్/సింగిల్ పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
IBPS RRB ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.