కరోనా కంటే పెద్ద విపత్తు సాఫ్ట్ వేర్ రంగాన్ని వెంటాడుతోందా? మూడేళ్లుగా ఇంటికే పరిమితమైన ఐటి రంగానికి కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయా? అవుననే అంటోంది సాఫ్ట్ వేర్ రంగం. ఇప్పటికి ఇంకా 60 శాతం వర్క్ ఫ్రం హోం కే పరిమితం కావడం ఈ అనర్థాలకు ప్రధాన కారణం కాబోతోందనే హెచ్చరికలే వస్తున్నాయి. ఇంతకీ ఎలాంటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఎలాంటి ముప్పు పొంచి వుంది. హైదరాబాద్ ఐటి పై వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఈరోజు తెలుసుకుందాం..
కరోనా కాలంలో ఇంటికి చేరిన రంగాల్లో సాఫ్ట్ వేర్ రంగం మొదటి వరుసలో నిలుచునివుంది. వర్క్ ఫ్రం హోం కు చేరి మూడేళ్లవుతున్నా.. ఈ రంగం ఇంకా 60శాతం ఇంటికి పరిమితమైంది. కంపెనీలు ఎన్ని విజ్థప్తులు చేసినా.. కేవలం 40 శాతం లోపు మాత్రమే.. ఆఫీసులకు వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ వున్నా.. పని జరగడం ముఖ్యం. ఈ సూత్రమే ఇప్పటి వరకూ నడిచింది. కంపెనీలకు కూడా కొన్ని ఖర్చులు తగ్గాయి కదా అనుకున్నారు. ఉద్యోగులు … ఇంటి పట్టున కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉన్నారు కదా .. అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త సమస్యలు ప్రారంభమవుతున్నాయి. అదే ఇప్పుడు ఐటికి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
ఇంటి దగ్గర నుంచి లాగిన్ అయి .. ఉద్యోగాలు చేయడం.. అందుకే ఎవరువర్క్ చేస్తున్నారనేది ఎవ్వరికీ తెలీదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఐటి ప్రాక్సీ. దీన్నే మూన్ లైటింగ్ దుమారం గా కంపెనీలు ముందుకు తెచ్చాయి. ఇంటిలో ఉండి వర్క్ చేస్తున్న ఉద్యోగి .. రెండు ఉద్యోగాలు ఏకకాలంలో చేయడం. ఒక కంపెనీ ఉద్యోగి తాను ఆ పనిచేయకుండా తక్కువ జీతానికి మరో వ్యక్తిని నియమించుకుని ఆ పని పూర్తిచేయించుకునే సిస్టమ్. దీన్ని గుర్తించిన కంపెనీలు ఇది డేంజర్ గా భావిస్తూ కట్టడిచేయాలనే ప్రయత్నం ప్రారంభించాయి.
ఐటీ కంపెనీలన్నీ.. ఇప్పుడు అయోమయంలో పడుతున్నాయి. పాండమిక్ పరిస్థితి తగ్గినా.. ఉద్యోగులు మాత్రం ముందుకు రావడంలేదు. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఇంటిలో ఉండి పనికి అలవాటు పడటం..బయటకు వస్తే అదనపు ఖర్చులు ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయంటున్నాయి ఐటీ కంపెనీల హెచ్ ఆర్ డిపార్టుమెంట్లు.
అయితే ఇంతకంటే ఐటి ఇండస్ట్రీని కుదిపేసే కష్టాలు మరిన్ని వెంటాడుతున్నాయి. ఇందులో స్కిల్డ్ ట్రాన్స్ ఫర్ ముప్పు ఒకటి. మరోవైపు ప్రొడక్టివిటీ కి కూడా నష్టం జరుగుతోంది. సాఫ్ట్ వేర్ రంగంలో ఎప్పటికప్పుడు ప్రొడక్టివిటీకి సంబంధించిన ముడి పదార్థం మారుతూ ఉంటుంది. కొత్త సాఫ్ట్ వేర్ లు కావచ్చు. లాంగ్వేజ్ లు కావచ్చు..కొత్త ప్రాజెక్టులు కావచ్చు. ఇలాంటివి వర్క్ ఫ్రం ఆఫీసులో ఉన్నప్పుడు .. ఒకరి నుంచి మరొకరు తెలుసుకునే వీలుంది. కానీ ఇప్పుడు అది పూర్తిగా దూరమైంది. ఎవరికి వారు.. అనే వర్క్ విధానంలో ..అప్ డేట్ అయ్యే పరిస్థితులు దూరమవుతున్నాయి.
మరోవైపు… ఉద్యోగులు ఇంతకాలం వర్క్ ఫ్రం బావుందనేకునే వారు.. కానీ ఇప్పడు ఇంటి వద్ద నిర్వహించే డ్యూటీకు కనీసం పని గంటలతో సంబంధం లేకుండా పోతోందంటున్నారు. లాగిన్ అయిన తర్వాత రాత్రి పగలు తేడా ఉండటం లేదంటున్నారు. కనీసం 12 గంటలు వర్క్ ఫ్రం హోం చేయాల్సి వస్తోందంటున్నారు. ఇది చాలా కష్టమైన విషయంగా ఐటి ఉద్యోగులంతా భావిస్తున్నారంటున్నాయి ఐటి అసోసియేషన్లు.
మరి ఎంత కాలం:
ఐటి రంగానికి ఈ ఇళ్లకే పరిమితయ్యే పరిస్థితి. దీని వల్ల ఎలాంటి నష్టం లేదా? ఎంప్లాయిస్ నుంచి.. సంస్థల యజమానుల వరకూ లాభాలేనా. మౌళిక సదుపాయాలకు చెల్లించే డబ్బు మిగలడమే.. వర్క్ ఫ్రం హోం కొనసాగడానికి కారణమా? అంటే కాదే కాదంటున్నాయి ఐటి కంపెనీలు
ఐటి సెక్టార్లో వస్తున్న లాభాలు.. అవుతున్న ఖర్చులను బేరీజు వేస్తే.. ఉద్యోగులపైనే అత్యధిక మొత్తం చెల్లిస్తున్నామంటున్నాయి ఐటి కంపెనీనల యాజమాన్యాలు. అద్దెలు.. విద్యుత్..రవాణా.. వంటి వాటికి వెచ్చిస్తున్న మొత్తం చాలా చిన్నదే అంటున్నాయి. దీని కోసం వర్క్ ఫ్రం హోం ను ప్రోత్సహించాల్సిన అవసరం కంపెనీలకు లేదంటున్నాయి. మరోవైపు .. 60 నుంచి 80శాతం చిన్న, సూక్ష్మ ఐటి కంపెనీలు ఇప్పటికే వర్క్ ఫ్రం నుంచి ఆఫీసులకు తమ ఉద్యోగులను రమ్మంటున్నారని.. ఇంకా లార్జ్.. కంపెనీలు పూర్తిస్ధాయిలో ఆఫీసుల్లో పనులు నిర్వహించాల్సి ఉందంటున్నారు ఐటి కంపెనీల అసోసియేషన్‌లు.
ఏది ఏమైనా తొందరలోనే ఐటి కంపెనీలు పూర్తి స్థాయిలో ఆఫీసుల్లో పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందంటున్నారు ఐటి కంపెనీల ప్రతినిధులు. కేవలం ప్రొడక్షనే కాదు… ఐటి రంగంలో ఎన్ని లోపాలు ఏర్పడాలో అన్నీఏర్పడతాంటున్నారు. ఎంత తొందరగా ప్రారంభిస్తే అంతమంచిదని లేకపోతే.. ఐటి గ్రోత్ దెబ్బతినే ప్రమాదముందంటున్నారు.
వర్క్ ఫ్రం హోం లో విధులపై ఉద్యోగుల స్పందన:
అయితే.. వర్క్ ఫ్రం హోం లో విధులు నిర్వహణ ఏ మాత్రం సరైంది కాదనే అభిప్రాయాన్ని అనేక మంది ఉద్యోగులూ వ్యక్తం చేస్తున్నారు. అదనపు పనిగంటలు పని చేయడమే కాదు.. మరో వైపు.. ప్రొడక్టివిటీ, వర్క్ ఎన్విరాన్ మెంట్ పోతున్నాయంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వర్క్ ఫ్రం హోం కంటే .. వర్క్ ఫ్రం ఆపీసే బెటరంటున్నారు.
అయితే… చాలా కంపెనీలు.. ఉద్యోగులను ఇంటి నుంచి బయటకు తీసుకురాడానికి అనేక కొత్త ఆలోచనలు చేస్తున్నాయి. ఎనిమిదిగంటల్లో కేవలం నాలుగు గంటలు మాత్రమే ఆఫీసులో విధులు నిర్వహించేలా.. మిగిలిన సమయాన్ని గేమ్స్ ఆడుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. టేబుల్ టెన్నిస్, ఫుడ్ బాల్ టేబుల్, క్యారమ్స్, బిలియర్డ్స్ వంటి గేమ్స్ ను ఏర్పాటుచేస్తున్నారు. పూర్తిగా పనిలో ఉండేలా కాకుండా ఆటవిడుపు కల్పిస్తున్నారు.
ఐటీ రంగం అంటే…అది కేవలం ఆ సంస్థల ఉద్యోగులే కాదు.. ఈ సెక్టార్ పై ఆధారపడిన రంగాలు సైతం కుంటుపడున్నాయి. కొన్ని దివాళా తీసి బతుకెట్లా అని ప్రశ్నిస్తున్నాయి. ఇలా ఒక ఐటి ఉద్యోగికి వన్ ఈస్టు త్రీ నుంచి 5 వరకూ ఇతరులు ఆధారపడిన రేషియో ఉంది. ఇందులో క్యాబ్ లు, ఆఫీసు విధులు నుంచి చిన్నిచిన్న వ్యాపారుల వరకూ ఉన్నారు. ఐటి సెక్టార్లో కొనసాగుతున్న ఈ వర్క్ ఫ్రం దోబూచులు.. ఫుడ్.. ట్రాన్స్ పోర్ట్..సెక్యురిటీ వంటి రంగాలు పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. ఒకప్పుడు బాగా నడిచిన వ్యాపారాలు ఇప్పుడు దివాళా తీస్తున్నాయి.
ప్రధానంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల రవాణా వ్యవస్థ కుంటుపడింది. 40 శాతం లోపు మాత్రమే ఉద్యోగులు ఆఫీసులకు వస్తుండటంతో దీనిపై ఆధాపడిన చాలా మంది పస్తులుంటున్నారు. చివరికి వాహనాల కొనుగోలు కోసం బ్యాంకు ల్లో చేసిన రుణాలకు ఈఎంఐలు చెల్లించుకునే పరిస్థితి లేక అయోమయంలో పడుతున్నారు.
హైదరాబాద్ సాఫ్ట్ వేర్ రంగం దేశంలోనే ఒక ముఖ్య పాత్రలో ఉంది. పూనె, బెంగళూరు మహానగరాలతో ఈక్వెల్ గా పరుగులు తీస్తోంది. ఇలాంటి సాఫ్ట్ వేర్ రంగం.. సాధారణ స్థితికి రాకపోతే… పెద్ద నష్టమే ఏర్పడుతుంది.
Reporter: Ganesh, Tv9 Telugu
మరిన్ని కెరీర్ & ఉద్యోగాలు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..