HAL notification: ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్.. HAL నోటిఫికేషన్ విడుదల
HAL notification: ITI పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఎగ్జామ్ లేకుండా ఎంపిక కావాలంటే మీకు మంచి అవకాశం. హైదరాబాద్ HAL (ఏవియానిక్స్ డివిజన్) 2026–27 కోసం ITI అప్రెంటిస్ ట్రైనింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 205 ఖాళీలు భర్తీ చేయనున్నారు.
HAL Recruitment 2026: ITI పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఎగ్జామ్ లేకుండా ఎంపిక కావాలా? అయితే మీకు మంచి అవకాశం వచ్చింది. హైదరాబాద్‌లోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) – ఏవియానిక్స్ డివిజన్ 2026–27 సంవత్సరానికి గాను ITI అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 205 ఖాళీలు భర్తీ చేయనున్నారు.
పోస్టు వివరాలు
పోస్టు పేరు: ITI ట్రేడ్ అప్రెంటిస్
మొత్తం ఖాళీలు: 205
అందుబాటులో ఉన్న ట్రేడ్లు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్, రిఫ్రిజిరేషన్ & AC, COPA, ప్లంబర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్ & మెకానికల్), ఎలక్ట్రోప్లేటర్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు
సంబంధిత ట్రేడ్‌లో NCVT గుర్తింపు పొందిన ITI పూర్తి చేసి ఉండాలి
Apprentices Act, 1961 ప్రకారం స్టైపెండ్ లభిస్తుంది
రిజర్వేషన్ నిబంధనలు (EWS/OBC/SC/ST/PH) వర్తిస్తాయి
ఎంపిక విధానం
రాత పరీక్ష లేదు
కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది
ఇంటర్వ్యూ తేదీలు
మే 28: ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్ (ఉదయం), ఫిట్టర్, ప్లంబర్, పెయింటర్ (మధ్యాహ్నం)
మే 29: COPA, మోటార్ వెహికల్ మెకానిక్ (ఉదయం), ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్ (మధ్యాహ్నం)
జూన్ 1: మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ & AC (ఉదయం), డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్, వెల్డర్, ఎలక్ట్రోప్లేటర్ (మధ్యాహ్నం)
అవసరమైన డాక్యుమెంట్లు
ఆధార్ కార్డ్
SSC మార్క్స్ మెమో
ITI సర్టిఫికెట్
పుట్టిన తేదీ ధృవీకరణ (అవసరమైతే)
కుల ధృవీకరణ పత్రం
Apprenticeship పోర్టల్ రిజిస్ట్రేషన్ కాపీ
ఇంటర్వ్యూ స్థలం
HAL, ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్ – 500042
(ఉత్సవ్ సదన్ ఆడిటోరియం)