DMHO Hyderabad Jobs 2023: హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు రాత పరీక్షలేకుండా ఎంపిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు..

DMHO Hyderabad Jobs 2023: హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు రాత పరీక్షలేకుండా ఎంపిక
DMHO Hyderabad

Updated on: Apr 30, 2023 | 1:51 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోనే అభ్యర్ధులు తప్పనిసరిగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా పోస్టులకు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 31, 2023వ తేదీనాటికి18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో మే 1, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను కింది అడ్రస్‌కు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, రిజర్వేషన్‌, అనుభవం, ఇంటర్వ్యూ, సర్టిఫికేషన్ల వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.27,300ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

DM&HO Hyderabad, Telangana.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us