AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coal India Jobs 2026: రూ.60 వేల జీతంతో కోల్‌ ఇండియాలో 660 ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే

కోల్ ఇండియా లిమిటెడ్ (CIL).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (E-1 గ్రేడ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 660 ఖాళీలను భర్తీ చేయనుంది..

Coal India Jobs 2026: రూ.60 వేల జీతంతో కోల్‌ ఇండియాలో 660 ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే
Coal India Management Trainee Recruitment
Srilakshmi C
|

Updated on: May 10, 2026 | 5:29 PM

Share

కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (E-1 గ్రేడ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 660 ఖాళీలను భర్తీ చేయనుంది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రాజభాష (హిందీ), కంపెనీ సెక్రటరీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో మే 12, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

కోల్ ఇండియా లిమిటెడ్‌ భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్ధులు తప్పనిసరిగా సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 2025-26 విద్యా సంవత్సరంలో చివరి సెమిస్టర్ చదువుతున్న వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 30 ఏప్రిల్ 2026 నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 11, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ1,180 చొప్పున తప్పనిసరిగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, కోల్ ఇండియా ఉద్యోగులకు ఎలాంటి రుసుము లేదు. ఆన్‌లైన్‌ రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.60 వేల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us