BSNL Jobs 2026: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? BSNLలో భారీ అవకాశం

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)లో జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.2.25 లక్షల జీతంతో పాటు వార్షిక ఇంక్రిమెంట్లు కూడా అందిస్తారు. రాత పరీక్ష లేకుండానే షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు..

BSNL Jobs 2026: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? BSNLలో భారీ అవకాశం
BSNL General Manager Recruitment

Updated on: Jun 12, 2026 | 7:50 PM

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 15 జనరల్ మేనేజర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆర్థిక రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

BSNLలో జనరల్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఇక్కడ చేయండి.

బీఎస్‌ఎన్‌ఎల్‌లోని ఫైనాన్స్ & అకౌంట్స్ విభాగంలో జనరల్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA) లేదా ఎంబీఏ (ఫైనాన్స్) లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (ఫైనాన్స్)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఆర్థిక రంగంలో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి దరఖాస్తు చివరి తేదీ నాటికి గరిష్ఠ వయస్సు 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూన్‌ 24, 2026వ తేదీ ఉదయం 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.1000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.2,25,000 జీతం చెల్లిస్తారు. అదనంగా ప్రతి సంవత్సరం 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు బీఎస్‌ఎన్‌ఎల్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ మంచి అవకాశంగా చెప్పవచ్చు. అర్హతలు కలిగిన వారు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవడం మంచిది.

BSNLలో జనరల్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఇక్కడ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us