AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group 1 ఉద్యోగాలకు అప్లై చేశారా? మరికొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తు గడువు!

APPSC గ్రూప్ 1 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. ఆంధ్రప్రదేశ్‌లో 166 గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు అక్టోబర్ 27తో ముగియనుంది. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ తదితర పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ప్రిలిమినరీ పరీక్ష 2027 జనవరి 24న నిర్వహించనున్నారు..

APPSC Group 1 ఉద్యోగాలకు అప్లై చేశారా? మరికొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తు గడువు!
APPSC Group 1 Recruitment Last Date
Srilakshmi C
|

Updated on: Oct 26, 2026 | 2:21 PM

Share

అమరావతి, అక్టోబర్ 26: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 సర్వీసుల్లో 166 ఖాళీల భర్తీకి చేపట్టిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 27 అర్ధరాత్రి వరకు మాత్రమే గడువు ఉంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు చివరి తేదీ కోసం వేచి చూడకుండా వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీ గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 166 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP), రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (RTO), డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) వంటి కీలకమైన పోస్టులు ఉన్నాయి. మొత్తం 13 రకాల ఏపీ సర్వీసులకు సంబంధించిన పోస్టుల భర్తీ కోసం ఈ నియామక ప్రక్రియ చేపట్టారు.

గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే పోస్టును బట్టి విద్యార్హతలు, వయోపరిమితిలో మార్పులు ఉండవచ్చు. సాధారణంగా వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉంటుంది. రిజర్వేషన్ కేటగిరీలకు వర్తించే వయోపరిమితి సడలింపులు, ఇతర అర్హతల వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. గ్రూప్ 1 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 6న ప్రారంభమైంది. అక్టోబర్ 27 అర్ధరాత్రితో దరఖాస్తుల గడువు ముగియనుంది. చివరి రోజు వెబ్‌సైట్‌పై రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో సర్వర్ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు తలెత్తవచ్చు. అందువల్ల అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.

ఇవి కూడా చదవండి

2027 జనవరి 24న ప్రిలిమ్స్

APPSC గ్రూప్-1 నియామక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్)ను 2027 జనవరి 24న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే పరీక్షకు సంబంధించిన సిలబస్, గత ప్రశ్నపత్రాలు, ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తూ ప్రిపరేషన్ ప్రారంభించాలి. అర్హులైన అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి సంబంధిత గ్రూప్-1 నోటిఫికేషన్‌ను పరిశీలించాలి. అనంతరం సూచించిన విధంగా ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేసి, అవసరమైన వివరాలను నమోదు చేయాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ వివరాలు, రసీదు లేదా కన్ఫర్మేషన్ కాపీని భద్రపరుచుకోవాలి.

Follow Us