AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC FBO Hall Tickets 2025: ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్‌ ఇదే

అటవీ శాఖలో అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్, బీట్‌ ఆఫీసర్, సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇటీవల వరుస నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించవల్సిన రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల..

APPSC FBO Hall Tickets 2025: ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్‌ ఇదే
Appsc Fbo Hall Tickets
Srilakshmi C
|

Updated on: Aug 30, 2025 | 6:27 AM

Share

అమరావతి, ఆగస్ట్‌ 30: ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖలో అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్, బీట్‌ ఆఫీసర్, సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇటీవల వరుస నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించవల్సిన రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు సంబంధిత అడ్మిట్‌ కార్డులను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు తమ ఓటీపీఆర్‌ నెంబర్‌, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్‌ చేసి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా రాత పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో సెప్టెంబరు 7, 2025న నిర్వహించనున్నట్లు ఇప్పటికే కమిషన్‌ తెలిపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అటవీ శాఖలో మొత్తం 691 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అంటే ఈ పరీక్ష పెన్ను, పేపర్‌ పద్ధతిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది. స్క్రీనింగ్‌ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ కూడా నిర్వహిస్తారు. మెయిన్స్‌ పరీక్షలో అర్హత సాధించిన వారికి నడక, మెడికల్‌ పరీక్షలు ఉంటాయి. అన్నిట్లోనూ అర్హత పొందినవారికి మాత్రమే ఉద్యోగం వరిస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రిలిమినరీ పరీక్ష ఎలా ఉంటుందంటే?

ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 150 మార్కులకు 150 నిమిషాల్లో నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో మాత్రమే ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ఇందులో పార్ట్‌ ఎ, పార్ట్‌ బి అనే రెండు భాగాలుగా ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క విభాగం నుంచి 75 ప్రశ్నలు వస్తాయి. 45 రోజుల సమయమే ఉంది కాబట్టి కొత్తగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పూర్తిగా సమయం కేటాయించి చదివితే విజయం వరిస్తుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా