AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TET 2026 రెస్పాన్స్ షీట్లు, ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

AP TET 2026 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌ వచ్చింది. పేపర్‌ 1A, 1B, 2A, 2Bలకు సంబంధించిన రెస్పాన్స్‌ షీట్లు, ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లలో తమ సమాధానాలను కీతో సరిపోల్చుకోవచ్చు. ఈ కిండి డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి..

AP TET 2026 రెస్పాన్స్ షీట్లు, ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
AP TET Answer Key Response Sheet
Srilakshmi C
|

Updated on: Aug 22, 2026 | 12:00 PM

Share

అమరావతి, ఆగస్ట్‌ 22: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2026)కు హాజరైన అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. టెట్ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచింది. టెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకుని తమ సమాధానాలను ప్రాథమిక కీతో సరిపోల్చుకుని అంచనా మార్కులను తెలుసుకోవచ్చు. పేపర్ 1A, 1B, 2A, 2B పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ లాగిన్‌ వివరాలతో ఎంటర్‌ అయ్యి రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ టెట్‌ 2026 రెస్పాన్స్ షీట్లు, ఆన్సర్ కీ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

అభ్యర్థులు aptet.apcfss.in లేదా tet2dsc.apcfss.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ లాగిన్ వివరాలతో రెస్పాన్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం ప్రాథమిక ఆన్సర్ కీతో సమాధానాలను సరిపోల్చుకోవచ్చు. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి తప్పు సమాధానాలకు మార్కులు కోత ఉండదు. ఆగస్టు 25 నుంచి ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించడం ప్రారంభ మవుతుంది. ఇక టెట్ ఫలితాలు సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. కాగా AP TET 2026 పరీక్షలు ఆగస్టు 5న ప్రారంభమై ఆగస్టు 21న సంగతి తెలిసిందే. ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. అభ్యర్థులు ప్రాథమిక ఆన్సర్ కీని జాగ్రత్తగా పరిశీలించి, ఏదైనా సమాధానం తప్పుగా ఉందని భావిస్తే నిర్ణీత గడువులోపు ఆధారాలతో అభ్యంతరం నమోదు చేసుకోవాలి. అనంతరం వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. దాని ఆధారంగా తుది ఫలితాలను ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి

ఏపీ టెట్‌ 2026 రెస్పాన్స్ షీట్లు, ఆన్సర్ కీ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ముఖ్యమైన తేదీలు..

  • అభ్యంతరాల నమోదు ప్రారంభ తేదీ: ఆగస్టు 25, 2026.
  • అభ్యంతరాల నమోదు చివరి తేదీ: ఆగస్టు 31, 2026.
  • ఫైనల్ ఆన్సర్ కీ విడుదల: సెప్టెంబరు 8, 2026.
  • తుది ఫలితాల విడుదల: సెప్టెంబరు 15, 2026.

Follow Us