Andhra Pradesh: గుడ్ న్యూస్.. రేపటి నుంచే వేసవి సెలవులు.. ఎప్పటివరకంటే..

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి చివరి వర్కింగ్‌ డే గా పేర్కొంది.

Andhra Pradesh: గుడ్ న్యూస్.. రేపటి నుంచే వేసవి సెలవులు.. ఎప్పటివరకంటే..
Ap Govt School Holidays

Updated on: Apr 30, 2023 | 8:20 AM

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి చివరి వర్కింగ్‌ డే గా పేర్కొంది. ఇవాళ విద్యార్థులు, తల్లిదండ్రలుతో మీటింగ్ నిర్వహించి రిపోర్ట్ కార్డులను అందించాలని ఆదేశించింది. సోమవారం నుంచి అంటే మే 1వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూల్స్‌కి వేసవి సెలవులు ఉంటాయి. ఇక 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి జూన్ 12వ తేదీ నుంచి తిరిగి స్కూల్స్ ప్రారంభం అవుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, స్కూల్ విద్యార్థులకు ఈ నెల 27వ తేదీన పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే.

ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్..

ఇకపోతే.. 2023-24 ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు. మొత్తం 302 రోజుల్లో.. పని దినాలు 227 రోజులని తెలిపింది. 75 రోజులు సెలవులు ఉంటాయని వెల్లడించింది. క్లాసులు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. అకడమిక్ క్యాలెండర్‌కి విరుద్ధంగా ఇంటర్ కాలేజీలు పనిచేసినట్లు తెలిస్తే చర్యలు తప్పవంటూ ఇంటర్ బోర్డు హెచ్చరించింది. జూలై 26 నుండి 28 వరకు యూనిట్ 1 పరీక్షలు జరుగుతాయని.. ఆగస్ట్ 24 నుండి 26 వరకు యూనిట్ 2 పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. సెప్టెంబర్ 16 నుండి 23 వరకు క్వార్టర్లీ ఎగ్జామ్స్.. అక్టోబర్ 16 నుండి 18 వరకు యూనిట్ 3 పరీక్షల నిర్వహించాలని సూచించింది.

అక్టోబర్ 19 నుండి 25 వరకు దసరా సెలవులు ఉంటాయని.. డిసెంబర్ 18 నుండి 23 వరకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నిర్వహణ ఉంటుందని ఇంటర్ బోర్డు వెల్లడించింది. జనవరి 11 నుండి 17 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. జనవరి 19 నుండి 25 వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని… ఫిబ్రవరి రెండో వారంలో ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పెట్టాలని సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం చివరి వర్కింగ్ డే 28-3-2024 అని వివరించింది. 2024 మార్చి 29 నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రారంభమై.. మే 31న ముగుస్తాయని ప్రెస్ నోట్‌లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us