AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!

డీఎస్సీ ద్వారా మరో 3 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. విజయనగరంలో జరిగిన రాష్ట్రస్థాయి క్లస్టర్‌ పాఠశాలల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. అలాగే ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు..

నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
Another 3000 Teachers Through DSC This Year
Srilakshmi C
|

Updated on: Aug 23, 2026 | 2:41 PM

Share

అమరావతి, ఆగస్ట్‌ 23: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించనుంది. డీఎస్సీ (District Selection Committee) ద్వారా మరో 3 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. విజయనగరంలోని దాసన్నపేట పాఠశాలలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి క్లస్టర్‌ పాఠశాలల సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంచడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని లోకేశ్‌ తెలిపారు. ఇకపై ప్రతి నెలా ఒక నియోజకవర్గంలోని క్లస్టర్‌ కాంప్లెక్స్‌ సమావేశంలో పాల్గొంటానని చెప్పారు.

సమాజంలో మనం ఆశించే మార్పును విద్య ద్వారానే సాధించవచ్చని తాను బలంగా నమ్ముతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను తెలుసుకునేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల ఉపాధ్యాయులతో మంత్రి మాట్లాడి, వారు అనుసరిస్తున్న బోధనా పద్ధతులను తెలుసుకున్నారు. అలాగే ఉపాధ్యాయుల నుంచి పలు సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,034 సముదాయాల ఉపాధ్యాయులు లైవ్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇంతకీ స్పెషల్ టెట్‌ ఉంటుందా?

ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ (Teacher Eligibility Test) నిర్వహించే అంశం కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. ఈ విషయంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు బోధనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించారు. విజయనగరంలో ఏపీ ఉపాధ్యాయ సంఘాలు, రాష్ట్రోపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులపై స్పందించిన మంత్రి ఈ మేరకు హామీ ఇచ్చారు. మరోవైపు డీఎస్సీ ద్వారా 3 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రకటన నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. పోస్టుల వివరాలు, అర్హతలు, పరీక్ష విధానం, దరఖాస్తు తేదీలపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరింత స్పష్టత రానుంది.

Follow Us
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
నిరుద్యోగులకు శుభవార్త.. DSC ద్వారా మరో 3 వేల టీచర్ పోస్టులు!
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
పాండవుల కోసం శ్రీకృష్ణుడు కోరిన ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఎక్కడున్నాయి
వాడు నా పొట్ట కొట్టాడు..
వాడు నా పొట్ట కొట్టాడు..
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర కూలర్ బాయ్.. ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే.. భళా అనిపిస్తున్న అడవుల పల్లె..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై..
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు
మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు..ఫుల్, హాఫ్‌గా ఎందుకు అంటారు
మిచెల్ స్టార్క్ పేరు మీద మరో వరల్డ్ రికార్డు
మిచెల్ స్టార్క్ పేరు మీద మరో వరల్డ్ రికార్డు
ఇలా కనిపిస్తే మటన్‌ను అస్సలు కొనొద్దు.. ఫ్రెష్ మాంసాన్ని..
ఇలా కనిపిస్తే మటన్‌ను అస్సలు కొనొద్దు.. ఫ్రెష్ మాంసాన్ని..
నాన్‌వెజ్‌ కర్రీ కమ్మగా, దూదిలా మెత్తగా రావాలంటే.. ఇలా వండితే..
నాన్‌వెజ్‌ కర్రీ కమ్మగా, దూదిలా మెత్తగా రావాలంటే.. ఇలా వండితే..