Breaking News
  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.35 కోట్లు మంజూరు. పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం. 627 మంది రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించనున్న ప్రభుత్వం.
  • చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత. 11.68 కిలోల నల్ల మందు, ఐదు కిలోల సూడోఫెడ్రిన్‌ స్వాధీనం. డ్రగ్స్‌ విలువ రూ.రెండున్నర కోట్లు ఉంటుందని అంచనా. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వ్యక్తిని అరెస్ట్‌ చేసిన అధికారులు.
  • ఏపీఈఆర్సీ సభ్యులను నియమించిన ప్రభుత్వం. పి.రాజగోపాల్‌, ఠాకూర్‌ రామసింగ్‌ను సభ్యులుగా పేర్కొంటూ ఉత్తర్వులు.
  • కర్నూలు: శ్రీశైలంలో అధికారుల అత్యుత్సాహం. గోపురానికి పాగ కట్టేవారి కుటుంబ సభ్యులను అనుమతించని అధికారులు. అధికారుల తీరుపై మండిపడుతున్న భక్తులు.
  • ప్రధాని మోదీతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌థాక్రే భేటీ. సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్సీపై ప్రధానితో చర్చించాం. ఈ అంశాలపై ఇప్పటికే మా వైఖరి తెలియజేశాం-ఉద్ధవ్‌థాక్రే. సీఏఏపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల పౌరసత్వాన్ని సీఏఏ హరించదు-ఉద్ధవ్‌థాక్రే.

ఇది సినిమా సెట్ కాదు.. యాక్సిడెంటే..?

Car Accident, ఇది సినిమా సెట్ కాదు.. యాక్సిడెంటే..?

సినిమా సెట్టింగ్ అనుకున్నారో ఏమో.. కానీ వాహనాలపై వెళ్తోన్నవారు ఆగి మరీ సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో.. ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్‌తో నిండిపోయింది. చివరకు పోలీసులు వస్తేనే గానీ.. అక్కడి వాళ్లకు అసలు విషయం అర్థంకాలేదు. అది సినిమా సెట్ కాదు.. యాక్సిడెంట్ అని.. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

విజయవాడలోని రామవరప్పాడు ఇన్నర్ రింగ్‌రోడ్డులో ఓ యాక్సిడెంట్ జరిగింది. గుణదల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. తన కారుతో రామవరప్పాడు రోడ్డు మీదుగా ఇంటికి వెళ్తున్నాడు. వేగంగా వెళ్తున్న కారు.. గుణదల రైల్వే వంతనపై ముందు వెళ్తున్న ఆటోని ఢీ కొట్టింది. వెంటనే కారు.. ఫుట్‌పాత్‌ మీదుగా రిటైనింగ్ వాల్ పైకి ఎక్కింది. వెనుక చక్రాలు వంతెన పక్కనున్న గోడపై వేలాడాయి. ఘటన విషయం తెలియగానే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారుని కిందికు దించారు.

Related Tags