సీఏఏ చట్టబధ్ధమైనదే.. కోర్టుల్లో ఎవరూ సవాల్ చేయలేరు.. కేంద్రం

సవరించిన పౌరసత్వ చట్టం (సీఏఏ) పూర్తిగా చట్టబధ్ధమైనది,రాజ్యాంగబధ్ధమైనదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది పార్లమెంట్ సార్వభౌమాధికారానికి సంబంధించినదని,  కోర్టులో ఎవరూ సవాలు చేయజాలరని పేర్కొంది

సీఏఏ చట్టబధ్ధమైనదే.. కోర్టుల్లో ఎవరూ సవాల్ చేయలేరు.. కేంద్రం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 17, 2020 | 3:53 PM

సవరించిన పౌరసత్వ చట్టం (సీఏఏ) పూర్తిగా చట్టబధ్ధమైనది,రాజ్యాంగబధ్ధమైనదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది పార్లమెంట్ సార్వభౌమాధికారానికి సంబంధించినదని,  కోర్టులో ఎవరూ సవాలు చేయజాలరని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సమర్పించిన తన ప్రిలిమినరీ అఫిడవిట్ లో వెల్లడించింది. రాజ్యాంగంలోని 246 అధికరణం కింద.. ఏడో షెడ్యూల్ లిస్టులోని ఏ అంశానికి సంబంధించిన విషయంపై అయినా చట్టాలు చేసే అసాధారణ అధికారాలు పార్లమెంటుకు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం  తెలిపింది.ఈ చట్టం ఏ భారతీయ పౌరుడి  హక్కులను కాలరాయడంలేదని, ప్రజల సెక్యులర్ లేదా లీగల్ లేక ప్రజాస్వామ్య హక్కులకు భంగకరం కూడా కాదు. అని వివరించింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో.. ఇక్కడి మైనారిటీల పట్ల ఇది నిర్లక్ష్యం చూపేదిగా ఉందని ఏ పిటిషన్ కూడా స్పష్టం చేయలేదని, ఈ అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సీఏఏని వ్యతిరేకిస్తూ వందకు పైగా దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు