PM Kisan: మీకు ఇంకా పీఎం కిసాన్‌ సొమ్ము జమ కాలేదా? కారణమేంటో తెలిస్తే షాకవుతారు..!

| Edited By: Ravi Kiran

Nov 20, 2023 | 10:00 PM

భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ.6,000 అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో అర్హులైన రైతు కుటుంబాలను గుర్తించి, వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులు బదిలీ చేస్తారు. ఈ పీఎం కిసాన్‌ వాయిదాను నవంబర్ 15న  15వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ పథకం ప్రారంభించిన దగ్గర నుంచి మొత్తం రూ. 18,000 కోట్లకు పైగా 80 మిలియన్లకు పైగా రైతులకు ప్రయోజనం చేకూర్చింది.

PM Kisan: మీకు ఇంకా పీఎం కిసాన్‌ సొమ్ము జమ కాలేదా? కారణమేంటో తెలిస్తే షాకవుతారు..!
Pm Kisan
Follow us on

రైతులకు ఆర్థిక భరోసాను కల్పించేందకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా సాయం చేస్తుంది. డిసెంబర్ 1, 2018 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకుని వచ్చారు. ఈ పథకంలో భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ.6,000 అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో అర్హులైన రైతు కుటుంబాలను గుర్తించి, వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులు బదిలీ చేస్తారు. ఈ పీఎం కిసాన్‌ వాయిదాను నవంబర్ 15న  15వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ పథకం ప్రారంభించిన దగ్గర నుంచి మొత్తం రూ. 18,000 కోట్లకు పైగా 80 మిలియన్లకు పైగా రైతులకు ప్రయోజనం చేకూర్చింది. అయితే ఇటీవల ప్రధాని మోదీ రిలీజ్‌ చేసిన సొమ్ముల్లు కొంత మంది రైతుల ఖాతాల్లో పడలేదు. అయితే పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌ అప్‌డేట్‌ చేసిన కారణంగా స్టేటస్‌ తెలుసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అలాగే కొంత మందికి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల సొమ్ము జమ కాలేదు. కాబట్టి పీఎం కిసాన్‌ సొమ్ములు మీ అకౌంట్‌లో జమ కాకపోవడానికి సంబంధించిన కారణాలను తెలుసుకుందాం.

హెల్ప్ డెస్క్

పీఎం కిసాన్‌ వాయిదాలు మీ అకౌంట్‌లో జమ కాకపోతే  వాయిదాలు రాని రైతులు పీఎం కిసాన్‌ హెల్ప్‌డెస్క్ ద్వారా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. ఫిర్యాదులను హెల్ప్‌లైన్‌ నెంబర్‌లు 011-24300606, లేదా 152261 లేదా 18001155266 ద్వారా సమస్యను తెలుపవచ్చు. అలాగే సంబంధిత మెయిల్స్‌కు  ఫిర్యాదులను పంపవచ్చు.

పీఎం కిసాన్‌ జమకాకపోవడానికి కారణాలివే

పీఎం-కిసాన్ యోజన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ఈ-కైవైసీ తప్పనిసరి చేసినందున ఈ-కెవైసి నిబంధనలను పాటించకపోతే సొమ్ము జమ కాలేదు. అలాగే అర్హత కలిగిన రైతులు మినహాయింపు ప్రమాణాల పరిధిలోకి రాకపోయినా లేకపోతే గడువులోపు అర్హతను నిరూపించుకోలేకపోయినా వారికి సొమ్ము జమ కాలేదు. 

ఇవి కూడా చదవండి

స్టేటన్‌ తనిఖీ ఇలా

  • ముందుగా పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • ‘ఫార్మర్స్ కార్నర్’లో ‘లబ్దిదారుల స్థితి’ని ఎంచుకోవాలి.
  • అనంతరం రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, పంచాయతీ వంటి వివరాలను పూర్తి చేయాలి.
  • రిజిస్టర్డ్ ఆధార్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేయండి
  • వాయిదా స్థితిని వీక్షించడానికి ‘డేటా పొందండి’ క్లిక్ చేయాలి. 

పీఎం కిసాన్‌ యాప్‌

రైతుల ఫిర్యాదులకు ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం గత నెలలో విస్తృతమైన సంతృప్త ప్రచారాన్ని ప్రారంభించింది. అయినప్పటికీ, కార్యాచరణ మార్గదర్శకాల్లో పేర్కొన్న మినహాయింపు ప్రమాణాల కారణంగా భూ యజమానులలో 100 శాతం సంతృప్తతను సాధించడం సవాలుగా ఉండవచ్చు. దీనిని పరిష్కరించడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆటోమేటెడ్ సంతృప్తత కోసం ఐటీ వ్యవస్థను అభివృద్ధి చేసింది. పీఎం కిసాన్‌ మొబైల్ యాప్ సహాయంతో డిజిటల్ రిజిస్ట్రేషన్, సమగ్ర రైతు నమోదులను అనుమతిస్తుంది.

కొత్త రైతుల నమోదు ఇలా

  • పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి “న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్” ఎంపికపై క్లిక్ చేయాలి.
  • అనంతరం అప్లికేషన్‌ను కొనసాగడానికి మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి.
  • మీరు పట్టణ ప్రాంతంలోని రైతు అయితే “అర్బన్ ఫార్మర్” ఎంపికను ఎంచుకోవాలి. గ్రామీణ ప్రాంతాల వారికి “గ్రామీణ రైతు నమోదు” ఎంచుకోవాలి.
  • అనంతరం మీ ఆధార్ నంబర్, ఫోన్ నంబర్‌ని పూరించి మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
  • మీ భూమికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలి.
  • మీ భూమికి సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేసి, సేవ్ చేయాలి.
  • క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి ఓటీపీను పొందండిపై క్లిక్ చేసి అందుకున్న ఓటీపీను సమర్పించడం ద్వారా ప్రక్రియను పూర్తి చేయాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..