AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. రేపే ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు

పీఎం కిసాన్ యోజన 15వ విడత సొమ్ము నవంబర్ 15న అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. ఈ విడతలో 8 కోట్ల మంది రైతులకు ఈ పథకంలో లబ్ధి పొందనున్నారు. ఈ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 15న దేశంలోని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ ద్వారా సొమ్మును బదిలీ చేస్తారు.

PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. రేపే ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు
Pm Kisan
Nikhil
| Edited By: |

Updated on: Nov 14, 2023 | 6:54 PM

Share

లక్షలాది మంది రైతులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదల తేదీని ప్రకటించింది. పీఎం కిసాన్ యోజన 15వ విడత సొమ్ము నవంబర్ 15న అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. ఈ విడతలో 8 కోట్ల మంది రైతులకు ఈ పథకంలో లబ్ధి పొందనున్నారు. ఈ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 15న దేశంలోని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ ద్వారా సొమ్మును బదిలీ చేస్తారు. పీఎం కిసాన్ పథకంలో భాగంగా భూమిని కలిగి ఉన్న రైతుల కుటుంబాలందరికీ సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం అందిస్తున్నారు. ఇది రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. ఇప్పటి వరకూ 8.5 కోట్ల మంది అర్హులైన రైతుల కోసం 17,000 కోట్ల రూపాయల సొమ్మును అందించారు. పీఎం కిసాన్ 14వ విడతను జూలై 27న విడుదల చేశారు. 

మీ పేరు ఉందో లేదో చెకింగ్‌ ఇలా

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి
  • హోమ్ పేజీలో పేజీకి కుడి వైపున ఉన్న ‘నో యువర్ స్టేటస్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
  • మీరు మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను పూరించాలి. అనంతరం ‘డేటా పొందండి’ ఎంపికను ఎంచుకోవాలి
  • అప్పుడు లబ్ధిదారుడి స్థితి తెలుస్తుంది. 

నమోదు ఇలా

  • ముందుగా పీఎం అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అయి ఫార్మర్‌ సెక్షన్‌కు వెళ్లాలి.
  • అనంతరం కొత్త రైతు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి ఆధార్ నంబర్‌ను నమోదు చేసి క్యాప్చా నింపాలి.
  • దీని తర్వాత, వివరాలను నమోదు చేసి, ‘అవును’పై క్లిక్ చేయండి
  • పీఎం కిసాన్ దరఖాస్తు ఫారమ్ 2023లో అడిగిన సమాచారాన్ని పూరించండి, దానిని సేవ్ చేయాలి.
  • అప్లికేషన్‌ను భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ తీసుకోవాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే