Voter ID: ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు.. ఓటర్ ఐడీ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకోండి.. ఆన్‌లైన్‌లోనే..

ఓటర్ ఐడీ ఒక ముఖ్యమైన గుర్తింపు ధృవీరణ పత్రంగా కూడా ఉపయోగపడుతుంది. దీంతో వివరాలు సరిగ్గా ఉండేలా చేసుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే మీరు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్, పాన్ వివరాలు అప్డేట్‌కు ఛార్జీలు వసూలు చేస్తారు. కానీ ఓటర్ ఐడీలోని వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.

Voter ID: ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు.. ఓటర్ ఐడీ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకోండి.. ఆన్‌లైన్‌లోనే..
Voter Id

Updated on: Oct 25, 2026 | 3:31 PM

ఓటు అనేది దేశ పౌరులందరికీ భారత రాజ్యాంగం కల్పించిన ఒక ప్రాథమిక హక్కు. ఓటుకు మన జీవితాలను, దేశ పరిస్థితులను మార్చేసేంత శక్తి ఉంటుంది. అందుకే ఓటు అనేది ఒక ఆయుధం లాంటిదని చెబుతుంటారు. ఓటు హక్కు వినియోగించాలంటే ఓటర్ ఐడీ పొంది ఉండాలి. ఓటు హక్కు వినియోగించుకోవడానికే కాకుండా ఒక గుర్తింపు ధృవీకరణ పత్రంగా కూడా మీకు ఉయోపగడుతుంది. ఓటర్ ఐడీలో మీ వ్యక్తిగత వివరాలన్నీ ఉంటాయి. పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి పేరు లాంటివన్నీ ఉంటాయి. దీంతో ప్రభుత్వ పథకాలు, సర్వీసులు పొందేందుకు ఒక ధృవీకరణ పత్రంగా కూడా పనిచేస్తుంది. దీంతో ఓటర్ కార్డులో వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఏమైనా తప్పులు ఉంటే మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా సులభంగా మార్చుకోవచ్చు.

ఓటర్ ఐడీలో పేరు, అడ్రస్, ఫొటో, డేట్ ఆఫ్ బర్త్, ఫొటో, తండ్రి పేరు, లింగం లాంటి అన్నీ వివరాలు మార్చుకోవచ్చు. దీనికి ఒక్క రూపాయి కూడా ఫీజు వసూలు చేయరు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఉచితంగా మార్చుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో మార్చుకోవాలంటే మీ బూత్ లెవల్ ఆఫీసర్‌ను సంప్రదించి చేసుకోవచ్చు. ఇక ఓటర్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ ద్వారా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

ఆన్‌లైన్ ద్వారా ఓటర్ ఐడీలో మార్పులు ఎలా..?

-https://voters.eci.gov.in/ పోర్టల్ తెరవండి

-హోమ్ పేజీలో దిగువున కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది

-అందులో ఫారం 8పై క్లిక్ చేయండి

-అనంతరం మీ ఓటర్ ఓడీ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి

-ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తి చేయండి

-దరఖాస్తు ఫారంలో మీ ఆధార్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ లాంటివి నమోదు చేయండి

-మీరు ఏది మార్చుకోవాలనుకుంటున్నారు(పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఫొటో, జెండర్) అనేది టిక్ మార్క్ చేసి సెలక్ట్ చేసుకోండి

-సరైన వివరాలు నమోదు చేయండి

-అనంతరం మార్పులకు సంబంధించి అవసరమైన ప్రూఫ్‌లు అప్‌లోడ్ చేయాలి

-ఫొటో అప్డేట్ చేయాలంటే కొత్త ఫొటో అప్‌లోడ్ చేయాలి

-అడ్రస్ మార్చుకోవాలంటే గ్యాస్, వాటర్ బిల్లు, ల్యాండ్ లైన్, వైఫై బిల్లు, పాన్, పాస్ పోర్ట్, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ లాంటివి అప్‌లోడ్ చేయాలి

-వివరాలు నమోదు చేశాక ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా ఈ-సైన్ చేయాలి

-అనంతరం అప్లికేషన్ సమ్మిట్ చేస్తే అక్‌నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వస్తుంది

-అక్‌నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ఆధారంగా మీ అప్డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us