ఫేస్‌బుక్‌కి యునిలివర్ యాడ్స్ బంద్..!

|

Jun 28, 2020 | 5:49 PM

గ్లోబల్ ఎఫ్‌ఎంసిజి దిగ్గజం యునిలివర్ ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించింది. ఇది ఇండియా మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపదని.. ఇది కేవలం అమెరికాకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ భారత అనుబంధ సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యుఎల్) తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో కనీసం 2020 చివరి వరకు ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు యునిలివర్ శుక్రవారం ప్రకటించింది.

ఫేస్‌బుక్‌కి యునిలివర్ యాడ్స్ బంద్..!
Follow us on

గ్లోబల్ ఎఫ్‌ఎంసిజి దిగ్గజం యునిలివర్ ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించింది. ఇది ఇండియా మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపదని.. ఇది కేవలం అమెరికాకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ భారత అనుబంధ సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యుఎల్) తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో కనీసం 2020 చివరి వరకు ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు యునిలివర్ శుక్రవారం ప్రకటించింది. సోషల్ మీడియాపై ఒత్తిడిని పెంచే లక్ష్యంతో ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లను నేఫత్యంలో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతుంది. మే నెలలో పోలీసు సిబ్బంది చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్-అమెరికన్ తండ్రి మరణం తరువాత ప్రపంచవ్యాప్తంగా “బ్లాక్ లైవ్స్ మేటర్” పై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారం వస్తోందని, వర్ణ వివక్ష, విద్వేష వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని యునిలివర్ వివరించింది. అయితే, పిచ్ మాడిసన్ అడ్వర్టైజింగ్ రిపోర్ట్ ప్రకారం, హిందూస్థాన్ యునిలివర్ 2018-19 సంవత్సరానికి గానూ భారతదేశంలో ప్రకటనల కోసం అత్యధికంగా ఖర్చు చేసింది. 2019 లో హిందూస్తాన్ యూనిలీవర్ రూ.3,400 కోట్లలను ప్రకటనల కోసం ఖర్చు చేసిందని నివేదిక పేర్కొంది. ప్రకటనల ఖర్చులో డిజిటల్ మీడియా 23 శాతం వాటాను కలిగి ఉంది. యూనిలివర్‌ సంస్థతో పాటు వెరిజాన్‌ కమ్యూనికేషన్స్‌, హెర్షె కో కంపెనీ ఫేస్ బుక్‌లో యాడ్స్‌ తగ్గిస్తామని ప్రకటించగా కోకాకోలా సైతం సోషల్‌ నెట్‌వర్కుల్లో ప్రకటనలు ఇవ్వడం మానేసింది.

ఇక, సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ఫేస్ బుక్‌కు భారీ షాక్ తగిలింది. ఫేస్ బుక్ నుండి కొన్ని కంపెనీలు యాడ్స్ విరమించుకోవడంతో భారీ నష్టాలను చవిచూసింది ఫేస్ బుక్‌. ఆ కంపెనీ షేర్లు 8.3 శాతం నష్టపోగా ఫేస్ బుక్ చీఫ్ జుకర్ బర్గ్ 7.2 బిలియన్ డాలర్లు(దాదాపు 50 వేల కోట్లు) నష్టపోయారు. ఫేస్‌బుక్‌ షేర్ల ధరలు తగ్గడంతో ఆ కంపెనీ మార్కెట్‌ విలువ 56 బిలియన్‌ డాలర్లకు పడిపోగా జుకర్‌బర్గ్‌ సంపద 82.3 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో జుకర్ మూడో స్ధానం నుండి నాలుగో స్ధానంకు పడిపోయారు. ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారం వస్తోందని విమర్శలు రావడంపై జుకర్‌బర్గ్ ‌స్పందించారు. వర్ణ వివక్ష, విద్వేష వ్యాఖ్యలు నిలువరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.