AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Services: ఈ ఒక్క యాప్ మీ మొబైల్‌లో ఉంటే 2,400 ప్రభుత్వ సేవలు పొందొచ్చు.. ఇంటి నుంచే పథకాలకు దరఖాస్తులు..

ఒక్క యాప్ సాయంతో 2,400 ప్రభుత్వ సేవలు పొందవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలకు మీరు వెళ్లాల్సిన పనే ఉండదు. కేవలం ఇంట్లో కూర్చుని మొబైల్ ద్వారా నిమిషాల్లోనే పని పూర్తవుతుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఓ యాప్ తీసుకొచ్చింది. అదే ఉమాంగ్ యాప్.

Digital Services: ఈ ఒక్క యాప్ మీ మొబైల్‌లో ఉంటే 2,400 ప్రభుత్వ సేవలు పొందొచ్చు.. ఇంటి నుంచే పథకాలకు దరఖాస్తులు..
Mobile
Venkatrao Lella
|

Updated on: Mar 26, 2026 | 4:45 PM

Share

కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలందరికీ డిజిటల్ విధానంలో సర్వీసులు అందించేందుకు ఉమాంగ్ అనే యాప్‌ను గతంలో తెచ్చింది. ఈ యాప్‌ను మరింత విస్తరిస్తున్న కేంద్రం.. ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను ప్రవేశపెడుతోంది. ఈ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే ప్రజలు తమ మొబైల్ ద్వారా నిమిషాల్లోనే ప్రభుత్వ సేవలు పొందవచ్చు. ఈ యాప్ ఒక్కటి మొబైల్‌లో ఉంటే 2,400కిపైగా ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ప్రభుత్వ కార్యాలయలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే సేవలు పొందవచ్చు. ఫిబ్రవరి 2026 నాటికి 737 కోట్ల లావాదేవీలు ఇందులో జరగ్గా.. 2017లో ఉమాంగ్ 3.9 కోట్ల లాదాదేవీలను నమోదు చేసింది.

ఉమాంగ్ యాప్ ఎందుకు..?

ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అక్కడ గంటల కొద్ది అధికారుల కోసం వేచి ఉండాలంటే సమయం వృథా అవుతుంది. విసుగు పుట్టడమే కాకుండా ఒక రోజంతా సమయం వృథా అవుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా ఉమాంగ్ యాప్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా పౌరులు సలభంగా సేవలు పొందవచ్చు. ఉమాంగ్ అంటే యూనిఫైట్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అని అర్థం. పలు ప్రభుత్వ శాఖల సేవలు ఇందులో ఒకేచోట లభిస్తాయి. గ్యాస్ బుకింగ్, పీఎఫ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు లాంటి అన్నీ సేవలు ఇక్కడ పొందవచ్చు. ఒక్కొ సేవలకు ఒక్కొ వెబ్ సైట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ యాప్‌లో అన్నీ ఒకేచోట లభిస్తాయి.

2017లో ప్రారంభం

2017లో ఉమాంగ్ యాప్‌ను ప్రారంభించారు. గత తొమ్మిదేళ్లుగా ఈ యాప్ వృద్ది సాధిస్తోంది. 2017లో కేవలం 166 సేవలతో ప్రారంభించగా.. ఇప్పుడు ఏకంగా 15 రెట్లు పెరిగింది. దీంతో యాప్ ఉపయోగించేవారు కూడా ఎక్కువయ్యారు. రోజువారీ అవసరాల కోసం ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ యాప్ ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా సులువుగా యాప్‌ను ఉపయోగించవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని తప్పడం వల్ల సమయం, ప్రయాణ ఖర్చులు కూడా ఆదా అవుతాయి. అలాగే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ సేవలు ఇందులో ఉన్నాయి. కోట్లాది మంది మొబైల్స్‌లో యాప్ ఉండగా.. రోజు లక్షలాది మంది యాక్సెస్ చేస్తున్నారు. నిమిషాల్లోనే యాప్ సాయంతో ప్రభుత్వ సేవలు పొందుతున్నారు.

Follow Us