Two Wheeler Loan: మీరు టూ వీలర్ కోసం లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా..? వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు ఇవే!

Two Wheeler Loan: అధిక స్థోమత లేని వారు టూ వీలర్ వాహనం తీసుకోవాలంటే వాయిదాల పద్దతిలో తీసుకునేందుకు ముందుకు వస్తుంటారు. అధిక శాతం ఈఎంఐ పద్దతిలో కొనుగోలు..

Two Wheeler Loan: మీరు టూ వీలర్ కోసం లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా..? వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు ఇవే!
Two Wheeler Loan

Updated on: Aug 15, 2021 | 7:15 PM

Two Wheeler Loan: అధిక స్థోమత లేని వారు టూ వీలర్ వాహనం తీసుకోవాలంటే వాయిదాల పద్దతిలో తీసుకునేందుకు ముందుకు వస్తుంటారు. అధిక శాతం ఈఎంఐ పద్దతిలో కొనుగోలు చేస్తుంటారు. అయితే బ్యాంకులు కూడా ద్విచక్ర వాహనాలను లోన్‌ మంజూరు చేస్తుంటాయి. అయితే బైక్‌పై రుణం తీసుకునే వ్యక్తి రుణానికి అర్హుడా? కదా అనేది చూస్తుంది. అన్ని సరిగ్గా ఉంటేనే అప్పుడు వాహనానికి రుణం మంజూరు చేస్తుంది. అయితే ద్విచక్ర వాహనాలకు అందించే రుణాలపై పలు బ్యాంకులు వివిధ రకాల వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం.. రుణం పొందడానికి ముందుగా గుర్తించుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజు, ప్రీపేమెంట్‌ ఫీజులు మొదలైనవి పరిశీలించుకోవాల్సి ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించేందుకు ఉన్న సామర్థ్యాన్ని సైతం అంచనా వేసుకోవాలి. సమయానికి బ్యాంకులకు చెల్లించకపోతే అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. టాప్‌ 20 బ్యాంకులో ద్విచక్ర వాహన రుణాల వార్షిక వడ్డీ రేటును ఈ విధంగా ఉన్నాయి. అలాగే లక్ష రూపాయల రుణానికి మూడు సంవత్సరాల కాలానికి ఎంత వడ్డీ రేటు, ఎంత ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందో చూద్దాం.

సెంట్రల్ బ్యాంక్: 7.25 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా: 7.35శాతం
UCO బ్యాంక్ : 10.7 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్: 8.70 శాతం
జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్: 8.70 శాతం
పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్: 8.80 శాతం
కెనరా బ్యాంక్: 9.80 శాతం
యాక్సిస్ బ్యాంక్: 10.8 శాతం
ICICI బ్యాంక్: 9.50 శాతం
IDBI బ్యాంక్: 9.80 శాతం
సౌత్ ఇండియన్ బ్యాంక్: 10.95 శాతం
బ్యాంక్ ఆఫ్ బరోడా: 11 శాతం
HDFC బ్యాంక్: 12 శాతం
ఫెడరల్ బ్యాంక్: 12.50శాతం
కాగా, ఈ సమాచారం బ్యాంక్‌ బజార్‌ నుంచి సేకరించడమైనది. వడ్డీ రేట్లు కూడా మారే అవకాశం ఉంటుంది. అందుకే రుణం తీసుకునే ముందు సమీప బ్యాంకును సంప్రదించి వడ్డీ రేట్లను తెలుసుకోవడం మర్చిపోవద్దు.

ఇవీ కూడా చదవండి

Debit Card EMI: ఈ బ్యాంకు డెబిట్‌ కార్డుతో ఈఎంఐ ఆప్షన్‌.. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలన్నీ పొందవచ్చు..!

Health Insurance: మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి.. లేకపోతే ఇబ్బందే!

Voter ID Address Change: మీ ఓటర్‌ ఐడీ కార్డులో అడ్రస్‌ తప్పుగా ఉందా..? అయితే మార్చుకోండిలా..!

Loading...
Unable to load recommendations.
Follow Us