AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Worlds Expensive Funerals: ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన 5 అంత్యక్రియల గురించి తెలుసా..? ఖర్చు ఎంతో తెలిస్తే మతిపోతుంది!

Worlds Expensive Funerals: కొన్ని దేశాల్లో ప్రముఖుల అంత్యక్రియలు నిర్వహించేందుకు వంద కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఇటీవల ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్ ప్రభుత్వం దాదాపు 25 మిలియన్ యూరోలు (సుమారు రూ. 225 కోట్లు) ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Worlds Expensive Funerals: ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన 5 అంత్యక్రియల గురించి తెలుసా..? ఖర్చు ఎంతో తెలిస్తే మతిపోతుంది!
Worlds Expensive Funerals
Subhash Goud
|

Updated on: Jul 07, 2026 | 1:36 PM

Share

ఇటీవల ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్ ప్రభుత్వం దాదాపు 25 మిలియన్ యూరోలు (సుమారు రూ. 225 కోట్లు) ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆయన భౌతికకాయాన్ని కడసారి దర్శనం కోసం ఇరాన్, ఇరాక్‌లలోని ఐదు ప్రముఖ నగరాలకు తీసుకెళ్లారు. దీనికోసం టెహ్రాన్‌లోనే దాదాపు 15 మిలియన్ యూరోలు, పవిత్ర నగరాలైన కోమ్, మషద్‌లలో 5 మిలియన్ యూరోలు కేటాయించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

1. అలెగ్జాండర్ ది గ్రేట్ (రాజసికందర్)

చరిత్రకారుల అంచనాల ప్రకారం.. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అంత్యక్రియలు గ్రీకు వీరుడు అలెగ్జాండర్‌వి. ఆయన అంత్యక్రియల కోసం దాదాపు 600 మిలియన్ డాలర్లు (ప్రస్తుత భారత కరెన్సీలో సుమారు రూ. 5,000 కోట్లకు పైగా) ఖర్చు చేశారు. ఆయన పార్థివ దేహాన్ని నిఖార్సయిన బంగారు శవపేటికలో ఉంచారు. అంతేకాకుండా, ఆ శవపేటికను తరలించడానికి డజన్ల కొద్దీ గుర్రాలు లాగే ఒక భారీ సువర్ణ రథాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు.

2. రోనాల్డ్ రీగన్ (మాజీ అమెరికా అధ్యక్షుడు)

2004లో అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ మరణించినప్పుడు నిర్వహించిన ప్రభుత్వ అధికారిక అంత్యక్రియలకు దాదాపు 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,300 కోట్లు) ఖర్చయింది. ఆధునిక చరిత్రలో ఇది అత్యంత ఖరీదైన అంత్యక్రియలలో ఒకటిగా నిలిచింది. రీగన్ మరణానంతరం అమెరికాలో 7 రోజుల పాటు జాతీయ సెంతాప దినాలు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

3. క్వీన్ ఎలిజబెత్ II (బ్రిటన్ రాణి)

2022లో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియలను యునైటెడ్ కింగ్‌డమ్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 160 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,300 కోట్లు) ఖర్చు చేశారు. ఈ బడ్జెట్‌లో సింహభాగం సైనిక కవాతులు, దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన పోలీసు భద్రత, ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చిన అంతర్జాతీయ ప్రముఖుల వసతి, ప్రోటోకాల్ ఏర్పాట్ల కోసమే ఖర్చయింది.

4. కిమ్ జోంగ్ ఇల్ (ఉత్తర కొరియా మాజీ అధినేత)

ఉత్తర కొరియా మాజీ పాలకుడు కిమ్ జోంగ్ ఇల్ అంత్యక్రియలు 2011లో జరిగాయి. దీనికోసం దాదాపు 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 330 కోట్లు) ఖర్చు చేశారు. నివేదికల ప్రకారం.. ఆయన భౌతికకాయం చెడిపోకుండా శాశ్వతంగా భద్రపరచడానికి (ఎంబాల్మింగ్) రష్యాకు చెందిన నిపుణులను రప్పించారు. అలాగే ఆయన జ్ఞాపకార్థం భారీ స్మారక చిహ్నాలు, విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఈ నిధులను ఉపయోగించారు.

5. జాన్ ఎఫ్ కెన్నెడీ (మాజీ అమెరికా అధ్యక్షుడు)

1963లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు గురైన తర్వాత, వాషింగ్టన్ డీసీలో ఆయనకు భారీ ఎత్తున అధికారిక అంత్యక్రియలు నిర్వహించారు. ఈ వీడ్కోలు వేడుకల కోసం అప్పట్లోనే దాదాపు 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 125 కోట్లు) ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: E20 Petrol: పాత వాహనదారులకు అలర్ట్.. E10 బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే ఆ భాగాలు దెబ్బతినే ఛాన్స్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన 5 అంత్యక్రియల గురించి తెలుసా..?
ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన 5 అంత్యక్రియల గురించి తెలుసా..?
పోతావ్ రా రేయ్.. ముందు రోడ్డు కూడా కనిపించనంతగా ఓవర్‌లోడింగ్..
పోతావ్ రా రేయ్.. ముందు రోడ్డు కూడా కనిపించనంతగా ఓవర్‌లోడింగ్..
సంజూ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ మెగా టోర్నీకి ఎంపిక చేసిన BCCI.!
సంజూ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ మెగా టోర్నీకి ఎంపిక చేసిన BCCI.!
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే
అయ్యబాబోయ్‌.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!
అయ్యబాబోయ్‌.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!
116 ఏళ్ల నవనీతమ్మ సంకల్పం వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల నవనీతమ్మ సంకల్పం వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ
నడుముకు బూడిద బెల్ట్స్.. అప్పట్లో పీరియడ్స్ టైమ్‌లో మహిళలు..
నడుముకు బూడిద బెల్ట్స్.. అప్పట్లో పీరియడ్స్ టైమ్‌లో మహిళలు..
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు
డాక్టర్లు,ఇంజనీర్లు కాదు..ప్లంబర్ సంపాదన తెలిస్తే నోరెళ్ల బెడతారు
డాక్టర్లు,ఇంజనీర్లు కాదు..ప్లంబర్ సంపాదన తెలిస్తే నోరెళ్ల బెడతారు
Basara: బాసర జ్ఞానసరస్వతి గర్భాలయం మూసివేత!
Basara: బాసర జ్ఞానసరస్వతి గర్భాలయం మూసివేత!