Sale deed: ఆస్తుల కొనుగోలులో ఈ పత్రం అత్యంత కీలకం.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

|

Jan 12, 2025 | 9:00 AM

భవిష్యత్తులో అధిక ఆదాయం అందించే వాటిలో భూములు, ఇళ్లు తదితర స్తిరాస్తులు చాలా ముఖ్యమైనవి. వీటిని కొనుగోలు చేయడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. ఎందుకంటే జనాభా రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. తద్వారా భూమికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. దీని విలువ పెరగడమే కానీ తగ్గిపోవడం అంటూ ఉండదు. అయితే భూములను, ఇతర ఆస్తులను కొనుగోలు చేసేటప్పుడు చాాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చట్టం ప్రకారం అన్ని నిబంధనలను పూర్తి చేయాలి. అప్పుడే ఆ ఆస్తిపై మీకు సంపూర్ణ హక్కు లభిస్తుంది. అటువంటి వాటిలో సేల్ డీడీ రిజిస్ట్రేషన్ అత్యంత ముఖ్యమైంది.

Sale deed: ఆస్తుల కొనుగోలులో ఈ పత్రం అత్యంత కీలకం.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
Sales Deed
Follow us on

ఆస్తుల కొనుగోలులో సేల్ డీడ్ అనేది చాాలా ముఖ్యమైనది. ఆస్తి యాజమాన్యం బదిలీని సూచిస్తుంది. అలాగే లావాదేవీలో పాల్గొన్న రెండు పక్షాల (కొనుగోలుదారులు, విక్రేత) హక్కులను కూడా రక్షిస్తుంది. దీన్ని ఒక రవాణా దస్తావేజుగా భావించవచ్చు. ఆ ఆస్తి గురించి సమగ్ర సమాచారాన్ని తెలియజేస్తుంది. ప్రాథమిక విక్రయ ఒప్పందంలో పేర్కొన్న అన్ని నిబంధనలను నెరవేర్చిన తర్వాత ఇది అమలవుతుంది. వివరంగా చెప్పాంటే ఆస్తి యాజమాన్యాన్ని అధికారికంగా విక్రేత నుంచి కొనుగోలుదారుడికి బదిలీ చేసే చట్టపరమైన పత్రం. లావాదేవీల నిబంధనలు, షరతులను వివరిస్తూ, ఆస్తి అమ్మకం, కొనుగోలును పారదర్శకంగా జరిగేలా చేస్తుంది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన కీలకమైన తీర్పును ఇచ్చింది.

సేల్ డీడీ నమోదు చేసిన తర్వాత మాత్రమే స్థిరాస్తి యాజమాన్యం బదిలీ చేయబడుతుందని తెలిపింది. ఆస్తిని స్వాధీనం చేసుకున్నంత మాత్రాన దానిపై యాజమాన్య హక్కులు ఉండవని స్పష్టం చేసింది. ఒక ఆస్తి కేసుకు సంబంధించి జరిగిన వాదోపవాదనల అనంతరం పై విధంగా తీర్పునిచ్చింది. 1882 నాటి ఆస్తి బదిలీ చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం రిజిస్టర్డ్ డ్యాక్యుమెంట్ల ద్వారా మాత్రమే ఆస్తి బదిలీ చేయవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న ఆధ్వర్యంలోని ధర్మాసనం గత నెలలో తన నిర్ణయం వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ.100, అంతకంటే ఎక్కువ విలువైన స్థిరాస్తి విక్రయం రిజిస్టర్డ్ డ్యాక్యుమెంట్ల ద్వారా మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆస్తిని స్వాధీనం చేసుకున్నా, డబ్బులు చెల్లించినా సరే డీడీ రిజిస్టర్ అయ్యే వరకూ యాజమాన్య హక్కులు బదిలీ చేయబడవు. సేల్ డీడీ నమోదు చేసినప్పుడు మాత్రమే స్తిరాస్తి యాజమాన్యం బదిలీ చెల్లుబాటు అవుతుంది.

వేలం కొనుగోలుదారులకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ నిర్ణయం ఆస్తి వ్యాపారులకు, మధ్యవర్తులకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకుంటే వారందరూ పవర్ ఆఫ్ అటార్నీ, వీలునామా ద్వారా ఆస్తిని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు ఇక అలా చేయడం కుదరదు. సేల్ డీడ్ లో విక్రేత, కొనుగోలుదారుల పేర్లు, చిరునామాలు ఉంటాయి. అలాగే ఆస్తికి సంబంధించిన హద్దులు, కొలతలు తదితర వివరాలను పొందుపర్చుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి