Sovereign Gold Bonds: గోల్డ్ బాండ్స్ కొనుగోలుతో బోలెడన్నీ లాభాలు.. ధర తగ్గినా చింతించాల్సిన అవసరం లేదంతే..!

|

Jul 25, 2024 | 4:45 PM

భారతదేశంలో బంగారం వినియోగం తారాస్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలతో పోటీపడేలా భారత్‌లో బంగారం వినియోగం ఉంటుంది. ఇతర దేశాల్లో ఆభరణాల కింద తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి మార్గంగానే వినియోగిస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో తరతరాలు ఆభరణాల బంగారం వినియోగం మాత్రమే అధికంగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా పెట్టుబడి మార్గంగా ఉపయోగపడేలా సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

Sovereign Gold Bonds: గోల్డ్ బాండ్స్ కొనుగోలుతో బోలెడన్నీ లాభాలు.. ధర తగ్గినా చింతించాల్సిన అవసరం లేదంతే..!
Sovereign Gold Bond
Follow us on

భారతదేశంలో బంగారం వినియోగం తారాస్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలతో పోటీపడేలా భారత్‌లో బంగారం వినియోగం ఉంటుంది. ఇతర దేశాల్లో ఆభరణాల కింద తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి మార్గంగానే వినియోగిస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో తరతరాలు ఆభరణాల బంగారం వినియోగం మాత్రమే అధికంగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా పెట్టుబడి మార్గంగా ఉపయోగపడేలా సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ బాండ్స్ బంగారం ధర ఆధారంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ బాండ్స్ కొనుగోలు చేస్తే వార్షిక రాబడి వస్తుంది. అలాగే బంగారం ఆభరాలు చేయించుకుంటే తరుగు, మజూరీ చార్జీలను కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తక్కువ కాలంలో ఈ బాండ్లు అధిక ప్రజాదరణ పొందాయి. అయితే కేంద్ర బడ్జెట్ ప్రభావంతో బంగారం ధర 10 గ్రాములకు దాదాపు మూడు వేలు తగ్గింది. అయితే ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారికి ధర తగ్గడం వల్ల నష్టం లేదని నిపునులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌జీబీల వల్ల వచ్చే రాబడితో పాటు ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఎస్‌జీబీకు సంబంధించిన యూనిట్ ఒక గ్రాము బంగారాన్ని సూచిస్తుంది. అలాగే ఇవి పెట్టుబడిదారులకు అంతర్లీన బంగారం విలువపై ఆదాయాన్ని పొందే అవకాశాన్ని అందిస్తాయి. ఎస్‌జీబీలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అలాగే పెట్టుబడిదారులకు జారీ చేసిన బాండ్ ముఖ విలువలో 2.5 శాతం వడ్డీ ఆదాయాన్ని అందిస్తాయి. అందువల్ల భౌతిక బంగారంపై పెట్టుబడితో పోల్చితే ఎస్‌జీబీలు మెరుగైన లాభాన్ని అందిస్తాయి. ఈ నేపథ్యంలో 10 గ్రాముల ఫిజికల్ గోల్డ్ రాబడితో 10 యూనిట్ల ఎస్‌జీబీల కొనుగోలుతో వచ్చే లాభనష్టాలను పరిగణలోకి తీసుకుంటే నాలుగేళ్ల క్రితం పది గ్రాముల బంగారం విలువ జీఎస్టీతో కలిపి రూ.56,450గా ఉంది. మనం అప్పుడు బంగారం ధరను ఇప్పటి ధరను పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర రూ.75,280గా ఉంది. అంటే నాలుగేళ్లల్లో రూ.18,830 రాబడిని అందించింది. ఇక బాండ్ల విషయానికి వస్తే బంగారం ధర పెరుగుదలకు అనుగుణంగా రాబడిని అందించినా బంగారం పెట్టుబడిపై పెట్టుబడిదారులకు 2.5 శాతం సొమ్ము వడ్డీగా లభించింది. 

ఆభరణం కింద బంగారాన్ని కొనుగోలు చేస్తే ధర స్థిరంగా పెరిగినా కొనుగోలుదారులు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌జీబీలు యూనిట్ ముఖ విలువలో 2.5 శాతం అదనపు ఆదాయాన్ని వడ్డీగా అందిస్తాయి. ఈ అదనపు ఆదాయ భాగం 4 సంవత్సరాలలో మొత్తం 10 శాతం రాబడిని సంపాదించింది. అంటే నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఎస్‌జీబీలకు సంబంధించిన రాబడి భౌతిక బంగారంతో పోలిస్తే అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో నిపుణులు బంగారాన్ని పెట్టుబడి మార్గంలోనే తీసుకోవాలని సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..