Bajaj Freedom 125: అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బజాజ్ సీఎన్‌జీ బైక్.. వాడే సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్

|

Jul 25, 2024 | 4:15 PM

బజాజ్ కంపెనీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఫ్రీడమ్ 125 పేరుతో సీఎన్‌జీ బైక్‌ను భారత మార్కెట్‌లో ఇటీవల విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ మోటార్ సైకిల్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బజాజ్ ఫ్రీడమ్ 125 పెట్రోల్, సీఎన్‌జీ రెండింటితో నడుస్తుంది. ముఖ్యంగా పెట్రోల్, సీఎన్‌జీ ట్యాంకుల ఫుల్ చేయిస్తే 330 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వడం ఈ బైక్ ప్రత్యేకత.

Bajaj Freedom 125: అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బజాజ్ సీఎన్‌జీ బైక్.. వాడే సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
Bajaj Freedom 125 Cng
Follow us on

సీఎన్‌జీ వెర్షన్‌లో ఇప్పటి వరకు కార్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. చాలా ఏళ్లుగా బైక్‌ల్లో కూడా సీఎన్‌జీ వెర్షన్ తీసుకురావాలని టాప్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బజాజ్ కంపెనీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఫ్రీడమ్ 125 పేరుతో సీఎన్‌జీ బైక్‌ను భారత మార్కెట్‌లో ఇటీవల విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ మోటార్ సైకిల్ అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బజాజ్ ఫ్రీడమ్ 125 పెట్రోల్, సీఎన్‌జీ రెండింటితో నడుస్తుంది. ముఖ్యంగా పెట్రోల్, సీఎన్‌జీ ట్యాంకుల ఫుల్ చేయిస్తే 330 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వడం ఈ బైక్ ప్రత్యేకత. కేవలం కిలోమీటరుకు రైడింగ్ ఖర్చు ఒక్క రూపాయి అవుతుందని బజాజ్ ప్రతినిధులు చెబులున్నారు. ఈ నేపథ్యంలో బజాజ్ సీఎన్‌జీ బైక్ కొనడం ఎంత మజాను అందిస్తుందో? దాన్ని వాడే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బజాజ్ సీఎన్‌జీ బైక్‌ను వాడే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.

ఓవర్ స్పీడ్ 

బజాజ్ ఫ్రీడమ్ బైక్ గరిష్టంగా 93 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. అయితే గరిష్ట వేగం అందుబాటులో ఉన్నా నిర్ణీత వేగంతో వెళ్లడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీఎన్‌జీ, పెట్రో బైక్‌ను 50-55 కిమీ వేగంతో నడపాలని సిఫార్సు చేస్తున్నారు. దీని వల్ల మైలేజ్ పెరగడంతో పాటు వాహన వేడిని నియంత్రించవచ్చని సిఫార్సు చేస్తున్నారు. 

ఒత్తిడి తనిఖీ

మీ పెట్రోల్ ట్యాంక్‌లో ఇంధనం నింపేటప్పుడు లేదా సీఎన్‌జీ ట్యాంకులో గ్యాస్ నింపే సమయంలో  సీఎన్‌జీ డిస్పెన్సర్ ఒత్తిడిని తనిఖీ చేయాలి. ఆప్టిమమ్ ప్రెజర్ వద్దే ఇంధనాన్ని రీఫిల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ పీడనం వద్ద ఇంధనం నింపితే పూర్తి స్థాయిలో సీఎన్‌జీ ట్యాంకులో గ్యాస్‌ను రీఫిల్ చేయలేము. 

ఇవి కూడా చదవండి

టైర్స్‌లో గాలి

ఏ వాహనానికైనా టైర్లు అనేవి కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే వాహన నిర్వహణ విషయంలో చాలా మంది టైర్లను పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా వాటికి గాలిని సరిగ్గా నింపరు. పెట్రోల్ ట్యాంక్, సీఎన్‌జీ ట్యాంకుతో వచ్చే బజాజ్ ఫ్రీడమ్ ఇతర మోటర్ సైకిల్స్‌తో పోలిస్తే బరువు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల టైర్లల్లో ఎప్పటికప్పుడు గాలి సజావుగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

నిర్వహణ

పెట్రో, సీఎన్‌జీ బైక్ అయిన ఫ్రీడమ్ 125 నిర్వహన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపునలు వివరిస్తున్నారు. ముఖ్యంగా టైమ్ ప్రకారం బైక్ సర్వీసింగ్ చేయించుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా వాహనాన్ని ఎక్కువ కాలం వాడేందుకు వీలవుతుంది.  

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..