Gold Prices Hike: బంగారం ధరల పెరుగుదలకు కారణం అదే.. నిపుణులు చెప్పే విషయాలు తెలిస్తే షాక్

|

Oct 06, 2024 | 7:00 PM

ఇటీవల కాలంలో బంగారం ధరలు సామాన్యులను షాక్‌కు గురి చేస్తున్నాయి. సామాన్యులకు బంగారం ఎప్పుడో అందుబాటులోకి లేకుండా పోయింది. ఏదో కొనాలనే ఉద్దేశంతో తక్కువ మొత్తంలోనే బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తూ ఉంటారు.  ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా బంగారంపై పెట్టుబడి సురక్షితమని భావించే వారి సంఖ్య పెరగడంతో ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ పెట్టుబడిదారులు తరచుగా బంగారం వైపు మొగ్గు చూపుతారు. అనిశ్చిత సమయాల్లో స్థిరమైన పెట్టుబడిగా బంగారాన్ని పరిగణిస్తారు.

Gold Prices Hike: బంగారం ధరల పెరుగుదలకు కారణం అదే.. నిపుణులు చెప్పే విషయాలు తెలిస్తే షాక్
Follow us on

ఇటీవల కాలంలో బంగారం ధరలు సామాన్యులను షాక్‌కు గురి చేస్తున్నాయి. సామాన్యులకు బంగారం ఎప్పుడో అందుబాటులోకి లేకుండా పోయింది. ఏదో కొనాలనే ఉద్దేశంతో తక్కువ మొత్తంలోనే బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తూ ఉంటారు.  ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా బంగారంపై పెట్టుబడి సురక్షితమని భావించే వారి సంఖ్య పెరగడంతో ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ పెట్టుబడిదారులు తరచుగా బంగారం వైపు మొగ్గు చూపుతారు. అనిశ్చిత సమయాల్లో స్థిరమైన పెట్టుబడిగా బంగారాన్ని పరిగణిస్తారు. బంగారు మార్కెట్ కూడా యూఎస్ పేరోల్స్ నివేదికను నిశితంగా గమనిస్తోంది. ఎందుకంటే ఇది ఫెడరల్ రిజర్వ్‌కు సంబంధించిన భవిష్యత్తు విధాన దిశ గురించి ఆధారాలు ఇస్తుంది. ఈ నివేదిక యూఎస్ ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనా వేయడానికి పెట్టుబడిదారులకు సహాయపడుతుంది. అలాగే వడ్డీ రేట్లకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ చర్యల ఆధారంగా కూడా బంగారం ధరలను ప్రభావితం అవుతున్నాయి. కంపెనీ పనితీరు లేదా ద్రవ్యోల్బణం కారణంగా ఆయా దేశాల కరెన్సీ బలహీనపడితే ఈక్విటీలు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా బంగారం తన స్థిరత్వాన్ని నిలుపుకుంటాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరల పెరుగుదలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

బంగారం పెరుగుదలకు భౌగోళిక పరిస్థితులే ప్రధాన కారణమని ఎక్కువ మంది నిపుణులు చెబుతున్నారు. ఈ ఉద్రిక్తతల కారణంగా చమురు రేటు కూడా అమాంతం పెరుగుతుంది. ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ దూకుడు కొనసాగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే బలమైన యూఎస్ డాలర్‌కు సంబంధించిన స్థిరమైన బాండ్ ఈల్డ్‌లు బంగారం, వెండిలో లాభాలను పరిమితం చేశాయి. ఈ కారకాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా బంగారం తాజా బ్రేక్‌అవుట్ స్థాయిలలో ట్రేడ్ అవుతుందని, ఇది రాబోయే సెషన్‌లలో మరింత ధర పెరుగుదలను సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్‌లో పది గ్రాముల బంగారం రూ.90 వేల మార్క్‌ను చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. 

ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత నిఫ్టీ 50 ఇండెక్స్ ఫ్యూచర్స్ నిరంతరం క్షీణిస్తున్నాయని, అప్పటి నుంచి నిఫ్టీ మొత్తం 575 పాయింట్లు పడిపోయిందని చెబుతున్నాయి. అయితే  చమురు ధరలు మాత్రం వరుసగా మూడో రోజు కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 75 డాలర్లకు చేరుకుంది. అయితే బంగారాన్ని వర్తకం చేయడానికి ముందు రెండు కీలక అంశాలను తప్పనిసరిగా పర్యవేక్షించాలని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..