AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Seat Belt: కారు సీటు బెల్ట్‌పై ఈ బటన్‌ ఎందుకు ఉంటుందో తెలుసా? దీని ఉపయోగం ఎంతో..

Car Seat Belt: సీటు బెల్ట్‌లో బ్లాక్ బటన్ లేకపోతే కట్టు వదులుతుంది. దీని కారణంగా కారులో కూర్చున్న వ్యక్తి దానిని లాగడం కష్టమవుతుంది. బ్లాక్ బటన్ కారణంగా సీట్ బెల్ట్ ధరించడంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే కారు నడిపే..

Car Seat Belt: కారు సీటు బెల్ట్‌పై ఈ బటన్‌ ఎందుకు ఉంటుందో తెలుసా? దీని ఉపయోగం ఎంతో..
Subhash Goud
|

Updated on: Jul 22, 2025 | 8:35 PM

Share

Car Seat Belt: ప్రతి ఒక్కరూ కారు నడుపుతున్నప్పుడు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. అది పాటించకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. మీరు కారు నడుపుతున్నట్లయితే సీటు బెల్టులు అటువంటి నియమాలలో ఒకటి. అందుకే మీరు భద్రత కోసం సీటు బెల్ట్ ధరించడం చాలా ముఖ్యం. సీటు బెల్ట్‌ లేకుండా ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధిస్తారు. ఈ బెల్ట్‌ వల్ల మీ ప్రయాణానికి సెఫ్టిగా ఉపయోగపడుతుంది. మీరు సీటు బెల్ట్ ధరించకపోతే, కారు ప్రమాదానికి గురైతే, మీరు పెద్ద నష్టాన్ని చవిచూడవచ్చు. కానీ మీరు సీటు బెల్ట్ ధరించినట్లయితే మీ మనుగడ అవకాశాలు పెరుగుతాయి.

ఇది కూడా చదవండి: Mobile Storage: వాట్సాప్‌తో మీ ఫోన్ స్టోరేజీ ఫుల్‌ అవుతోందా? ఈ ఒక్క సెట్టింగ్‌ చేస్తే చాలు!

అంతే కాకుండా సీటు బెల్టు పెట్టుకోకుండా కారు నడిపితే జరిమానా కూడా విధించవచ్చు. సీట్ బెల్ట్ పెట్టుకునేటప్పుడు మీ దృష్టిని కొన్నిసార్లు బెల్ట్‌పై కనిపించే నలుపు బటన్‌పై పడవచ్చు. ఈ బటన్ ఎందుకు ఉంటుందనే అనుమానం మీకెప్పుడైనా వచ్చింది. సీటు బెల్ట్‌లకు ఆ బ్లాక్ బటన్‌లు ఎందుకు ఉంటాయని మీరెప్పుడైనా ఆలోచించారా? సీట్ బెల్ట్‌లోని బ్లాక్ బటన్ బెల్ట్ కట్టు వెనుకకు వెళ్లకుండా నిరోధిస్తుంది. దీని వల్ల మీ ప్రయాణం సేఫ్‌గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సీటు బెల్ట్‌లో బ్లాక్ బటన్ లేకపోతే కట్టు వదులుతుంది. దీని కారణంగా కారులో కూర్చున్న వ్యక్తి దానిని లాగడం కష్టమవుతుంది. బ్లాక్ బటన్ కారణంగా సీట్ బెల్ట్ ధరించడంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే కారు నడిపే ముందు ఇలాంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి: Bank Holiday: ఖాతాదారులకు అలర్ట్‌.. జూలై 23న బ్యాంకులు మూసి ఉంటాయా? లేదా?

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి