Senior Citizen Savings Scheme: సినియర్‌ సిటిజన్లకు గుడ్‌న్యూస్.. పోస్టాఫీస్‌లో ఏడాదికి 8.2 వడ్డీ వచ్చే స్కీం ఇదే!

|

May 08, 2024 | 9:34 PM

ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పొదుపు చేసి.. వయసైపోయాక తమకు భరోసాగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఎందులో తమ డబ్బు భద్రంగా ఉంటుందో తెలియక తప్పుడు గైడెన్స్‌తో డబ్బు పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే సీనియర్ సిటిజన్స్‌కు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇచ్చే ఈ స్కీం దాదాపు 8 శాతానికి పైగా వడ్డీని అందించడమే కాకుండా, ప్రతి నెలా ఆదాయాన్ని కూడా ఇస్తుంది. పెట్టుబడి భద్రతకు..

Senior Citizen Savings Scheme: సినియర్‌ సిటిజన్లకు గుడ్‌న్యూస్.. పోస్టాఫీస్‌లో ఏడాదికి 8.2 వడ్డీ వచ్చే స్కీం ఇదే!
Senior Citizen Savings Scheme
Follow us on

ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పొదుపు చేసి.. వయసైపోయాక తమకు భరోసాగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఎందులో తమ డబ్బు భద్రంగా ఉంటుందో తెలియక తప్పుడు గైడెన్స్‌తో డబ్బు పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే సీనియర్ సిటిజన్స్‌కు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇచ్చే ఈ స్కీం దాదాపు 8 శాతానికి పైగా వడ్డీని అందించడమే కాకుండా, ప్రతి నెలా ఆదాయాన్ని కూడా ఇస్తుంది. పెట్టుబడి భద్రతకు పటిష్ట హామీ ఇస్తుంది. ఇక్కడ తమ డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా అద్భుతమైన రాబడిని పొందొచ్చు. తద్వారా వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అదే పోస్టాఫీసు అందిచే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (Post Office SCSS Scheme). ఇది ముఖ్యంగా సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇందులో పెట్టుబడిపై 8 శాతానికిపైగా వార్షిక వడ్డీ వస్తుంది.

8.2 శాతం అద్భుతమైన వడ్డీ

పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎలా ఉంటుందంటే.. ఇది బ్యాంకుల్లోని బ్యాంక్ ఎఫ్‌డితో పోలిస్తే ఇది అధిక వడ్డీని ఇవ్వడమే కాకుండా ఆదాయం కూడా పెంచుతుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా నెలకు రూ. 20,000 వరకు సంపాదించవచ్చు. జనవరి 1, 2024 నుంచి ప్రతి నెలా రూ.20 వేలు పెట్టుబడి పెట్టే వారికి ఏడాదికి 8.2 శాతం వడ్డీ అందిస్తుంది.

కేవలం 1000 రూపాయలతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి

పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ఖాతా తెరవడానికి కనీసం రూ.1,000తో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చు. ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 30 లక్షల వరకు ఉంది. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థికంగా సంపన్నంగా ఉండేందుకు ఈ పోస్టాఫీసు పథకం చాలా సహాయకారిగా ఉంటుంది. ఇందులో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వ్యక్తి లేదంటే జీవిత భాగస్వామితో ఉమ్మడి ఖాతాను కూడా తెరవవచ్చు.

ఇవి కూడా చదవండి

మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు

పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే వ్యక్తి 5 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే అంతకన్నా ముందే ఖాతా మూసివేస్తే నిబంధనల ప్రకారం ఖాతాదారు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి SCSS ఖాతాను సులభంగా తెరవవచ్చు. ఈ పథకం కింద కొన్ని సందర్భాల్లో వయో సడలింపు కూడా ఇస్తారు.

బ్యాంక్ ఎఫ్‌డీ కంటే ఎక్కువ రాబడి

పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై 8.2 శాతం వడ్డీని అందిస్తోంది. మన దేశంలోని అన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లకు 5 సంవత్సరాలకు FD చేయడానికి 7 నుండి 7.75 శాతం వడ్డీని అందిస్తుంటే.. ఈ పోస్టాఫీస్‌ స్కీం మాత్రం 8.2 శాతం వడ్డీని అందిస్తుంది. వివిధ బ్యాంకుల ఎఫ్‌డి రేట్లను పరిశీలిస్తే.. దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్‌లకు ఐదేళ్ల ఎఫ్‌డిపై 7.50 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ 7.50 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) 7 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్) 7.50 శాతం వడ్డీ వార్షికంగా ఇస్తోంది.

1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు

ఈ పథకంలోని ఖాతాదారుడు కూడా పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా పొందవచ్చు. SCSSలో పెట్టుబడి పెట్టే వ్యక్తికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు వార్షిక పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ పథకంలో ప్రతి మూడు నెలలకు వడ్డీ మొత్తాన్ని చెల్లించే నిబంధన ఉంది. ఇందులో ప్రతి ఏప్రిల్, జులై, అక్టోబర్, జనవరి మొదటి రోజు వడ్డీ చెల్లిస్తారు. ఒకవేళ మెచ్యూరిటీ వ్యవధి ముగిసేలోపు ఖాతాదారు మరణించినట్లయితే ఖాతా మూసివేస్తారు. ఆ మొత్తం నామినీకి అందజేస్తారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.