Punganur Cow: పుంగనూరు ఆవు, దూడకు రికార్డు ధర.. ఏకంగా రూ.5.30 లక్షలకు కొనుగోలు!

Punganur Cow: ఈ ఆవు 100 శాతానికి పైగా స్వచ్ఛమైన పుంగనూరు జాతి లక్షణాలు కలిగి ఉందని, 36 అంగుళాల ఎత్తుతో పాటు జాతికి సంబంధించిన ప్రత్యేక శరీర నిర్మాణం, మూపురం వంటి లక్షణాలు కలిగి ఉందని వివరించారు. రోజుకు రెండు పూటలా..

Punganur Cow: పుంగనూరు ఆవు, దూడకు రికార్డు ధర.. ఏకంగా రూ.5.30 లక్షలకు కొనుగోలు!
Punganur Cow

Edited By:

Updated on: Nov 10, 2026 | 1:24 PM

Punganur Cow: ఉభయ గోదావరి జిల్లాల్లోనే పుంగనూరు ఆవుకు అత్యధిక ధర పలికిందని ఫామ్ నిర్వాహకుడు అడబాల ప్రేమ్ కుమార్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామం. గ్రామంలోని ఆధ్యశ్రీ డైరీ ఫామ్‌లో పెంచుతున్న స్వచ్ఛమైన పుంగనూరు జాతి ఆవు-గిత్తదూడ కు రికార్డు స్థాయిలో ధర లభించింది. మద్రాసుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఈ ఆవును ఏకంగా రూ.5 లక్షల 30 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు ఫామ్ నిర్వాహకుడు ప్రేమ్ కుమార్ తెలిపారు. గతంలో తమ ఫామ్ నుంచి ఎన్డీడీబీ సౌత్ బ్యాంక్‌కు కూడా పుంగనూరు ఆవును అందించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం పలికిన రూ.5.30 లక్షల ధర ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యధికమని ఆయన తెలిపారు.

ఈ ఆవు 100 శాతానికి పైగా స్వచ్ఛమైన పుంగనూరు జాతి లక్షణాలు కలిగి ఉందని, 36 అంగుళాల ఎత్తుతో పాటు జాతికి సంబంధించిన ప్రత్యేక శరీర నిర్మాణం, మూపురం వంటి లక్షణాలు కలిగి ఉందని వివరించారు. రోజుకు రెండు పూటలా మూడు లీటర్ల చొప్పున ఆరు లీటర్లు పాలు ఇస్తుందని ప్రేమ్ కుమార్ చెప్పారు. కార్తీక మాసంను పురస్కరించుకుని స్వచ్ఛమైన పాలు,పెరుగు, నెయ్యి కోసం పుంగనూరు ఆవును తమ యజమాని కొనుగోలు చేసినట్లు ఆవును తమిళనాడు తీసుకెళ్లేందుకు వచ్చిన వ్యాపారవేత్త గుమస్తా తెలిపారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us