AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Plan: జియోలో అదిరిపోయే ప్లాన్‌.. కేవలం రూ.111 రీఛార్జ్‌తో 28 రోజులు!

Jio Plan: రిలయన్స్ జియో రూ.111 ఫ్లెక్స్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో డేటా సదుపాయం కూడా ఉంది. ఈ ప్లాన్‌లో ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వినియోగదారులు తమకు..

Jio Plan: జియోలో అదిరిపోయే ప్లాన్‌.. కేవలం రూ.111 రీఛార్జ్‌తో 28 రోజులు!
Jio
Subhash Goud
|

Updated on: Sep 10, 2026 | 3:29 PM

Share

Jio Plan: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం వివిధ సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. వాటిలో రూ.111 ప్లాన్ ఒకటి. ఇది ఒక ప్రత్యేకమైన ఫ్లెక్స్ యూత్ అండ్ గేమింగ్ ప్యాక్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇది మొత్తం 5GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అంటే వినియోగదారులు 28 రోజుల వ్యవధిలో ఈ 5GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాక్‌లో మరో ప్రత్యేకమైన ప్రయోజనం కూడా ఉంది.

అది రెండు విభిన్న ఆప్షన్‌లను ఎంచుకునే అవకాశం. గేమింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారు గేమింగ్ ప్యాక్‌ను ఎంచుకోవచ్చు. దీని ద్వారా వారికి జియో గేమ్ మొబైల్‌కు 56 రోజుల యాక్సెస్ లభిస్తుంది. మరొకవైపు, యూత్ ప్యాక్ ఎంచుకునే వారికి జియో గేమ్ మొబైల్‌తో పాటు ఫ్యాన్‌కోడ్, స్నాప్‌చాట్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌లు కూడా లభిస్తాయి. ఈ యూత్ ప్యాక్ ఆప్షన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ అదనపు ప్రయోజనాలను పొందాలంటే రీఛార్జ్ చేసిన తేదీ నుండి 28 రోజుల లోపు మైజియో యాప్‌లో అందించిన వోచర్‌ను రీడిమ్ చేసుకోవాలి.

వోచర్‌ను విజయవంతంగా రీడిమ్ చేసిన తర్వాత మీరు ఎంచుకున్న ప్రయోజనం యాక్టివేట్ అవుతుంది. మొత్తం మీద, ఈ రూ.111 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 5GB డేటాతో పాటు గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. గేమింగ్ ఎక్కువగా ఆడే వారికి గేమింగ్ ప్యాక్. అలాగే సోషల్ మీడియా, క్రీడలు, గేమింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారికి యూత్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజుల సెలవులు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us