Multibagger Stock: రూ.1 లక్షను రూ.6.5 లక్షలు చేసిన షేర్.. 2026లో ఏకంగా 500 శాతానికిపైగా రాబడి!

Multibagger Stock: ఈ షేర్ భారీగా పెరిగినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. రాజ్వి లాజిట్రేడ్ మార్కెట్ విలువ సుమారు రూ.52 కోట్ల స్థాయిలో ఉన్న మైక్రోక్యాప్ కంపెనీ. ఈ షేర్‌లో ట్రేడింగ్ వాల్యూమ్స్ తక్కువగా ఉండటం వల్ల అవసరమైన..

Multibagger Stock: రూ.1 లక్షను రూ.6.5 లక్షలు చేసిన షేర్.. 2026లో ఏకంగా 500 శాతానికిపైగా రాబడి!
Multibagger Stock

Updated on: Nov 11, 2026 | 11:42 AM

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో కొన్ని షేర్లు ఇన్వెస్టర్లకు ఊహించని స్థాయిలో లాభాలను అందిస్తుంటాయి. అలాంటి షేర్లలో ఒకటిగా ప్రస్తుతం రాజ్వి లాజిట్రేడ్ లిమిటెడ్ (Rajvi Logitrade Ltd) నిలిచింది. ఈ కంపెనీ షేర్లు 2026లో భారీగా పెరిగి మల్టీబ్యాగర్ స్టాక్‌గా వార్తల్లో నిలిచాయి. ఏడాది ప్రారంభంలో ఈ షేర్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి కొనసాగించిన వారికి కొన్ని నెలల్లోనే ఆ పెట్టుబడి విలువ రూ.6 లక్షలకు పైగా చేరినట్లు నివేదికలు వెల్లడించాయి.

రూ.13 నుంచి రూ.83కు పెరిగిన షేర్ ధర:

2026 ప్రారంభంలో రాజ్వి లాజిట్రేడ్ షేర్ ధర సుమారు రూ.13 స్థాయిలో ఉండేది. నవంబర్ 9, 2026 నాటికి ఈ షేర్ ధర రూ.82.92 నుంచి రూ.83 స్థాయికి చేరింది. ఈ పెరుగుదలతో ఏడాది ప్రారంభం నుంచి సుమారు 535–566 శాతం వరకు రాబడిని అందించినట్లు వేర్వేరు మార్కెట్ నివేదికలు పేర్కొన్నాయి.

రూ.1 లక్ష పెట్టుబడి రూ.6.35 లక్షలుగా:

ఈ షేర్‌లో ఏడాది ప్రారంభంలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ వద్ద అప్పట్లో సుమారు 7,657 షేర్లు ఉండేవి (రూ.13.06 ధరను పరిగణనలోకి తీసుకుంటే). నవంబర్ 9 నాటి రూ.82.92 ధర ప్రకారం వాటి విలువ సుమారు రూ.6.35 లక్షలకు చేరేది. అంటే పెట్టిన పెట్టుబడిపై సుమారు రూ.5.35 లక్షల లాభం వచ్చినట్లు లెక్క. అయితే ఇది గత ధరల ఆధారంగా వేసిన అంచనా మాత్రమే. బ్రోకరేజ్ ఛార్జీలు, పన్నులు, కొనుగోలు-అమ్మకం ధరల వ్యత్యాసం ఇందులో లెక్కించలేదు.

అసలు ఏం చేస్తుంది ఈ కంపెనీ?

రాజ్వి లాజిట్రేడ్ ఒక లిస్టెడ్ లాజిస్టిక్స్ కంపెనీ. రవాణా, షిప్పింగ్, కార్గో హ్యాండ్లింగ్, వేర్‌హౌసింగ్, పోర్ట్ లాజిస్టిక్స్, ఆఫ్‌షోర్ లాజిస్టిక్స్ వంటి సేవలతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గుజరాత్‌లోని గాంధీధామ్ కేంద్రంగా కంపెనీకి కార్యకలాపాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

కంపెనీ ఆర్థిక ఫలితాల్లోనూ వృద్ధి

2026 సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 36 శాతం పెరిగినట్లు. నికర లాభం రూ.13.26 లక్షల నుంచి రూ.53.91 లక్షలకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే కంపెనీ అప్పులు లేదా బాధ్యతలు మార్చి నెలలోని రూ.15.69 కోట్ల నుంచి సెప్టెంబర్ చివరి నాటికి రూ.9.50 కోట్లకు తగ్గినట్లు తెలిపింది.

ఇన్వెస్టర్లు తప్పక గమనించాల్సిన రిస్క్

ఈ షేర్ భారీగా పెరిగినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. రాజ్వి లాజిట్రేడ్ మార్కెట్ విలువ సుమారు రూ.52 కోట్ల స్థాయిలో ఉన్న మైక్రోక్యాప్ కంపెనీ. ఈ షేర్‌లో ట్రేడింగ్ వాల్యూమ్స్ తక్కువగా ఉండటం వల్ల అవసరమైన సమయంలో కొనడం లేదా అమ్మడం కష్టమయ్యే అవకాశం ఉందని మార్కెట్ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. వరుసగా అప్పర్ సర్క్యూట్లు నమోదవడం కూడా ఈ షేర్‌లో లిక్విడిటీ సమస్యను సూచించవచ్చు.

ఇది కూడా చదవండి: Biryani Business: రూ.99 బిర్యానీ.. ఓనర్‌కు రోజుకు ఎంత లాభం వస్తుంది? ఇలా చేస్తేనే సక్సెస్‌.. లేకుంటే నష్టమే..!

ముఖ్యంగా: గతంలో ఈ షేర్ భారీ రాబడిని ఇచ్చిందని భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో లాభాలు వస్తాయని హామీ లేదు. ధరలు వేగంగా పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే కంపెనీ ఆర్థిక పరిస్థితి, షేర్ ట్రేడింగ్ వాల్యూమ్స్, ప్రస్తుత ధర, పెట్టుబడి రిస్క్‌లను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఇది పెట్టుబడి సలహా కాదు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఇక ఈ రైళ్లకు తత్కాల్ టికెట్లు ఉండవు.. కొత్త రూల్స్ ఇవే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us