AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్‌.. ఈ రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు..!

Indian Railways: తిరుపతి తిరుచానూరు రేణిగుంట నుంచి రాకపోకలు నిర్వహించే ఎక్స్ప్రెస్ రైళ్లను కొద్ది రోజులపాటు రైల్వే శాఖ రద్దు చేసింది. చెన్నై తిరుపతి మధ్య నడిచే సప్తగిరి ఎక్స్ప్రెస్ 27 రోజుల పాటు రద్దు చేసింది. ఇక కడప- అరక్కోణం, తిరుచానూరు- అరక్కోణం, చెన్నై- తిరుచానూరు..

Indian Railways: రైల్వే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్‌.. ఈ రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు..!
Indian Railways
Raju M P R
| Edited By: |

Updated on: Nov 10, 2026 | 11:56 AM

Share

Indian Railways: తిరుమలకు రైళ్లలో చేరుకునే ప్రయాణికులకు రైల్వే శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. దక్షిణ కోస్తా రైల్వేకు ముఖద్వారమైన రేణిగుంట జంక్షన్ లో జరుగుతున్న ఆధునీకరణ పనులతో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లింపు నిర్ణయం తీసుకుంది. రేణిగుంట రైల్వే స్టేషన్ యార్డ్ ఆధునీకరణలో భాగంగా రైలు మార్గాల అనుసంధానం చేపట్టింది. ఈ మేరకు నేటి నుంచి డిసెంబర్ 27 వరకు రోజువారి రైళ్లతో పాటు వీక్లీ ట్రైన్స్ రద్దు చేయడం మరికొన్ని ప్రధానమైన రైళ్ల రాకపోకలను దారి మళ్లిస్తూ నిర్ణయం తీసుకుంది. దక్షిణ కోస్తా రైల్వే జోనల్ అధికారి విజయ్ కిషన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. దక్షిణ కోస్తా రైల్వేకు మెయిన్ ఎంట్రీ గా ఉన్న రేణిగుంట జంక్షన్ కు నాలుగు మార్గాల నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ రైళ్ల రద్దీ ఆయా గమ్య స్థానాలకు చేరుకోవడం ఆలస్యం అవుతుందని రైల్వే శాఖ భావిస్తోంది.

చెన్నై తిరుపతి మధ్య నడిచే ప్రతి రైలు అరగంటకు పైగా నిర్వహణ సమయం పడుతుందని ఈ సమస్యను అధిగమించడానికి నూతనంగా బైపాస్ లైన్ ఏర్పాటు చేసిన రైల్వే శాఖ రేణిగుంట ప్లాట్ ఫారం నుంచి తిరుపతి వెళ్లడానికి మరో కిలోమీటర్ రైలు మార్గం కూడా అదనంగా ఏర్పాటు చేసింది. అయితే నీటి నుంచి ఈ మార్గాలను అనుసంధానం చేసే పనులను చేపడుతున్న రైల్వే శాఖ కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయడం మరికొన్నింటిని దారి మళ్ళించడం చేస్తోంది.

రద్దు చేసిన రైళ్లు ఇవే..

తిరుపతి తిరుచానూరు రేణిగుంట నుంచి రాకపోకలు నిర్వహించే ఎక్స్ప్రెస్ రైళ్లను కొద్ది రోజులపాటు రైల్వే శాఖ రద్దు చేసింది. చెన్నై తిరుపతి మధ్య నడిచే సప్తగిరి ఎక్స్ప్రెస్ 27 రోజుల పాటు రద్దు చేసింది. ఇక కడప- అరక్కోణం, తిరుచానూరు- అరక్కోణం, చెన్నై- తిరుచానూరు, గూడూరు- రేణిగుంట, నెల్లూరు- రేణిగుంట మధ్య రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైళ్లను 48 రోజులపాటు రద్దు చేసింది. ఇక తిరుపతి- విశాఖపట్నం మధ్య వారంలో మూడు రోజులపాటు నడిచే డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ను డిసెంబర్ 9 నుంచి 26 వరకు రద్దు చేసింది. ఇక తిరుచానూరు నుంచి నాందేడ్, జల్నా, కాచిగూడ చర్లపల్లి మధ్య రాకపోకలు సాగించే వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ను రెండు రోజులు రద్దు చేసింది. అలాగే రేణిగుంట మైసూర్ మధ్య నడుస్తున్న ఎక్స్ప్రెస్ ను డిసెంబర్ 11, 12, 18, 19, 25 తేదీల్లో రద్దు చేసిన రైల్వే అధికారులు తిరుపతి భువనేశ్వర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలును డిసెంబర్ లో ఎనిమిది రోజులపాటు రద్దు చేసింది. ఈ మేరకు డిసెంబర్ 12, 13, 14, 19 20, 21, 26, 27 తేదీల్లో తిరుపతి భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ అయింది.

దారి మళ్ళిన రైళ్లు ఇవే..

  • ఇక ముంబై నుంచి రేణిగుంట మీదుగా చెన్నై వెళ్లే రైళ్లను గుత్తి, అనంతపురం, ధర్మవరం మీదుగా నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
  • ఇక గూడూరు నుంచి రేణిగుంట మీదుగా చెన్నై వెళ్లే రైళ్లను సూళ్లూరుపేట మీదుగా నడపనుంది.
  • రేణిగుంట మీదుగా ముంబై, హౌరా, ఢిల్లీ, కన్యాకుమారి, చెన్నై, త్రివేండ్రం, బెంగళూరు, మైసూరుకు వెళ్లే రైళ్లను గుత్తి, ధర్మవరం మీదుగా నడవనున్నాయి

ఇది కూడా చదవండి: House Construction: ఇల్లు కట్టిస్తున్నారా? ఏ పనికి ఎన్ని రోజులు పడుతుంది.. క్యూరింగ్ ఎన్ని రోజులు చేయాలి? పూర్తి వివరాలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us