AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉచితంగా గ్యాస్‌ కావాలా? LPG సిలిండర్‌తో పాటు స్టవ్‌ కూడా ఫ్రీ! ఎలా పొందాలంటే?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఉన్నా, కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన మహిళల కు ఉచిత LPG గ్యాస్ కనెక్షన్ లభిస్తోంది. దరఖాస్తుదారు మహిళై ఉండాలి, బీపీఎల్‌ కుటుంబ సభ్యురాలై ఉండాలి.

ఉచితంగా గ్యాస్‌ కావాలా? LPG సిలిండర్‌తో పాటు స్టవ్‌ కూడా ఫ్రీ! ఎలా పొందాలంటే?
Lpg Cylinder
SN Pasha
|

Updated on: Mar 21, 2026 | 12:07 AM

Share

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా మన దేశంలో ఎల్‌పీజీ కొరత నెలకొంది. ఇలాంటి సమయంలో గ్యాస్‌ దొరకడమే కష్టంగా మారింది. అలాంటి ఉచితంగా గ్యాస్‌ ఎవరు ఇస్తారని అనుకుంటున్నారా? అయితే ఈ పథకం గురించి తెలుసుకోండి. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోజన (PMUY) పథకం కింద లక్షలాది మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు ఉచిత LPG గ్యాస్‌ కనెక్షన్‌ అందిస్తున్నారు.

ఈ పథకం ప్రయోజనం పొందేందుకు దరఖాస్తుదారు మహిళ అయి ఉండాలి, కుటుంబం బీపీఎల్‌ (Below Poverty Line) జాబితాలో ఉండాలి. అదనంగా SECC డేటాలో పేరు ఉండటం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పేదరిక ప్రమాణాలు తీరాలి. దరఖాస్తుదారికి ఇప్పటికే LPG కనెక్షన్‌ ఉండకూడదు. దరఖాస్తు ప్రక్రియ సులభంగా ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సమీప గ్యాస్‌ ఏజెన్సీకి వెళ్లి లేదా ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేయవచ్చు. దరఖాస్తు సమయంలో ఆధార్‌ కార్డ్‌, రేషన్‌ కార్డ్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు సమర్పించాలి. అప్లికేషన్‌ ఆమోదం పొందిన తర్వాత, ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌తో పాటు స్టవ్‌, మొదటి సిలిండర్‌ అందించే అవకాశం ఉంటుంది.

ఈ పథకం ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉపయోగించే కట్టెలు, బొగ్గు వంటి ఇంధనాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను తగ్గించడం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉజ్వల యోజన మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతోంది. సరైన అర్హతలు ఉంటే పీఎం ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ పొందడం సులభమే.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us