Gold Investment: మధ్యతరగతి ప్రజలు బంగారంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? పర్సనల్ ఫైనాన్స్ నిపుణుల సలహా ఇదే..
మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలోని బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో ముందువరుసలో భారత్ తళుక్కు మంటూ నిలుస్తుంది. బంగారం ఆభరణాలు చేయించుకోవడం.. ఏదో కడ్డీల రూపంలో దాచుకోవడం అందరూ చేసే పనే. అయితే, ఇటీవల కాలంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చనే ఆలోచన పెరిగింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు బంగారం ఆభరణాలుగా కాకుండా ఇన్వెస్ట్ చేయడానికి ఒక స్పెషల్ పొదుపు కార్యక్రమంగా భావిస్తున్నారు.
పండగ వస్తే బంగారం కొనాలని ఉవ్విళ్లూరిపోతారు మహిళలు. పెళ్లిళ్ల దగ్గరకు వచ్చేసరికి ఇక చెప్పనవసరం లేదు. పెళ్లి విందు ఘుమఘుమలు కొద్దిగా తగ్గవచ్చు ఏమో కానీ బంగారం ధగ ధగలు మాత్రం తగ్గేదేలే అనేట్లుగా మెరిసిపోతాయి. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలోని బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో ముందువరుసలో భారత్ తళుక్కు మంటూ నిలుస్తుంది. బంగారం ఆభరణాలు చేయించుకోవడం.. ఏదో కడ్డీల రూపంలో దాచుకోవడం అందరూ చేసే పనే. అయితే, ఇటీవల కాలంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చనే ఆలోచన పెరిగింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు బంగారం ఆభరణాలుగా కాకుండా ఇన్వెస్ట్ చేయడానికి ఒక స్పెషల్ పొదుపు కార్యక్రమంగా భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పుడు బంగారంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ వస్తోంది. అందులో భాగంగా సావరిన్ గోల్డ్ బాండ్స్ తీసుకువచ్చింది. ఇది ఇలా ఉంటె.. అసలు బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చా? పరిశీలిద్దాం.
బంగారంలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చాయి. డిజిటల్ గోల్డ్ అందులో బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ బంగారం భౌతికంగా మన దగ్గర ఉండదు. సులభమైన భాషలో చెప్పాలంటే.. మనం బంగారం కొనుక్కుంటే మన పేరుపై డిజిటల్ లాకర్ లో బంగారం ఉంటుంది. అవసరం అనుకుంటే.. దానిని భౌతిక బంగారంగా మార్చుకోవచ్చు. లేదంటే.. అలానే ఉంచి తిరిగి ఇచ్చేస్తే అప్పటి ధర ప్రకారం మన డబ్బు మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు వంద రూపాయలు కూడా డిజిటల్ గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని చాలా కంపెనీలు తీసుకువచ్చాయి. పేమెంట్ యాప్స్ కూడా ఈ ఆప్షన్ అందిస్తున్నాయి.
బంగారంపై పెట్టుబడి సరైనదేనా..?
బంగారం మంచి పెట్టుబడి మంచిదేనా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఒక వస్తువు లేదా ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్ మంచిదా కాదా అనేది అంచనా వేయడానికి దాని రాబడిని మాత్రమే పరిశీలించాలి. ఉదాహరణకు, కొంత కాలం క్రితం వరకు FDలు, ముఖ్యంగా పన్ను ఆదా చేసే FDలు మధ్యతరగతి పెట్టుబడి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే, ఇప్పుడు FD రాబడి 7% చుట్టూ ఉండటంతో, ఈ ప్రోడక్ట్ దాని వెలుగు కోల్పోయింది. ఇప్పటికీ సురక్షితమైన పెట్టుబడి మార్గంగా FDని పరిగణిస్తున్నారు. అలాగే మధ్యతరగతి పెట్టుబడిదారులు ఎక్కువ ఇంట్రస్ట్ చూపించే ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). దీనిలోనూ పరిమిత రాబడులు ఉంటాయి. కానీ మన డబ్బుకు గ్యారెంటీ ఉంటుంది.
ఇక మూడో ఆప్షన్ బంగారం. మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని పెట్టుబడి కోణంలో చూడకపోయినా.. ఆభారాణాలుగా కొని అవసరం కోసం దాచుకోవడం సాధారణంగా జరుగుతుంది. అయితే, పెట్టుబడి కోణంలో దీర్ఘకాలానికి చూస్తే గోల్డ్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. బంగారంపై పెట్టుబడి ఎప్పుడూ షార్ట్ టర్మ్ కోసం మంచిది కాదు. బంగారం ధరల్లో ఎప్పుడూ హెచ్చుతగ్గులు ఉంటాయి. అందువల్ల ఈరోజు కొని రెండురోజుల్లో అమ్మేసుకుందామని అనుకుంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంత మంచి ఆప్షన్ కాదు. ఒకవేళ చాలా కాలం పాటు మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటేనే బంగారం మంచి పెట్టుబడి సాధనంగా చెప్పవచ్చు. దీర్ఘకాలంలో బంగారంపై ఇన్వెస్ట్మెంట్ సురక్షితంగా కనీసం 8 శాతం రాబడి ఇస్తుందని నిపుణుల లెక్కలు చెబుతున్నాయి. దీర్ఘకాలానికి అంటే పదేళ్ళ పాటు ఇన్వెస్ట్ చేస్తే బంగారంపై 14 శాతానికి పైగా రాబడి రావచ్చనేది ఒక అంచనా.
బంగారంపై ఎంత ఇన్వెస్ట్ చేయాలి?
ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు బంగారంపై పెట్టుబడి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అయితే, బంగారంపై రిటర్న్స్ బావుంటాయని.. ఇన్వెస్ట్మెంట్ మొత్తం బంగారంపై చేయడం అంత వివేకమైన చర్య కాదు. పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యభరితంగా ఉండాలి. మధ్యతరగతి వారైనా.. డబ్బు ఉన్నవారైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వివిధ రకాల సాధనాల్లో పెట్టుబడి పెట్టడం మంచి పధ్ధతి అని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఒక భాగంగా మాత్రమే బంగారం ఉండాలి. సాధారణంగా పోర్ట్‌ఫోలియోలో 5%-10% మాత్రమే బంగారానికి కేటాయించాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. దీర్ఘకాలానికి మదుపు చేయాలికానీ, షార్ట్‌టర్మ్ కోసం కాదు. బంగారం ఒక చక్రీయ పెట్టుబడిగా ఉంటుంది. అయితే పసిడి ధరలు నిత్యం పెరుగుతూ.. మనకు అధిక రాబడిని ఇస్తాయని అనుకోవడం సరైనది కాదు. మీరు తక్షణ ఫలితాల కోసం ఆశించకుండా దీర్ఘకాల పెట్టుబడిదారు అయితే.. బంగారంపై పెట్టుబడి ఉత్తమంగా భావించాలి.
బంగారంపై ఎంత పెట్టుబడి పెట్టాలి?
బంగారంలో పెట్టుబడి పెట్టడం గురించి ఖచ్చితంగా చెప్పాల్సిన ఒక విషయం ఏమిటంటే, అనిశ్చితి లేదా సంక్షోభ సమయం, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు మంచి రక్షణ కోసం పసిడి మీకు సహాయం చేస్తుంది. అందుకే.. దీన్ని పెట్టుబడి సాధనాల్లో ఒకటిగా పరిగణించాలి. మీరు మధ్యతరగతికి చెందిన వారా కాదా అనే దానితో సంబంధం లేకుండా బంగారం మీ పోర్ట్‌ఫోలియోలో భాగం కావాలి. పెట్టుబడి పోర్ట్‌ఫోలియో మొత్తంలో 5%-10% మాత్రమే బంగారానికి కేటాయించాలి.
మొత్తమ్మీద చూసుకుంటే, బంగారంపై పెట్టుబడి సురక్షితం..లాభదాయకం. అదే సమయంలో స్వల్ప వ్యవధి కోసం బంగారంపై ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. అలాగే, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ ఒకే సాధనంలో చేయడం వలన కూడా రిస్క్ ఎక్కువగానే ఉంటుందనేది అర్ధం చేసుకోవాలి.